అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Manala Mohan Reddy | కేంద్రం నుంచి రావాల్సిన యూరియా రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతుంటే.. ఎంపీ అర్వింద్ (MP Arvind) మాత్రం అది కాంగ్రెస్ తప్పు అన్నట్లుగా మాట్లాడడం సరైంది కాదని సహకార కార్పొరేషన్ ఛైర్మన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
వేల్పూర్‌లో (Velpur) ఆదివారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడం ఎంపీకే చెల్లిందన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ఇటీవల బోధన్‌లో జరిగిన సంఘటనలో ఉగ్రవాది పట్టుబడితే.. ఆ ఘటనను కాంగ్రెస్‌కు అంటగట్టడం ఆయన మతిలేని స్థితికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా కాంగ్రెస్ పార్టీకి, ముస్లింలకు, ఎంఐఎంకు ముడి వేయడం ఆయన అవివేకమన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దాడులకు సిద్ధంగా ఉంటే ఇప్పటికే బీజేపీ నాయకులపై ఎన్నో దాడులు జరిగేవన్నారు.
కానీ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అధికారంలోకి వచ్చిన రోజే చట్టం విషయంలో పోలీసులకు కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధిపై తప్ప బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కుతంత్రాలపై ఆలోచించే సమయం కూడా లేదన్నారు.
Manala Mohan Reddy | ప్రశాంత్‌రెడ్డికి అవగాహన లేదా..?
మరో పక్క స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (Mla Prashanth Reddy) యూరియా కొరతపై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మానాల పేర్కొన్నారు. యూరియా కేంద్రం నుంచి వస్తుందని ఆయనకు పదేళ్లుగా తెలుసుండి కూడా ఇలా మాట్లాడడం ఆయన అవివేకమన్నారు.
కేంద్రం నుండి రాష్ట్రానికి యూరియా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్లో దానిని విక్రయిస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా పరిగణించాలని.. అంతేకానీ కేంద్రం నుంచి యూరియా రాకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేయడం ప్రశాంత్ రెడ్డి బీజేపీ వత్తాసు పలకడమే అని ధ్వజమెత్తారు.
కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ కుంట రమేష్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ దామోదర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్, బీసీ మండల్ ప్రెసిడెంట్ రమణ, కిసాన్ సెల్ మండల ప్రెసిడెంట్ రవి, భగవాన్ దాస్, సోషల్ మీడియా మండల ప్రెసిడెంట్ మహేందర్, రమేశ్, మల్లయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజేశ్వర్, జేమ్స్ గంగారెడ్డి,రాజేందర్, కిరణ్ గౌడ్, జంగన్న, రమేశ్, మైలారం గంగారెడ్డి, జంగన్న, మైపాల్, యూత్ కాంగ్రెస్ నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.