More
    HomeతెలంగాణHyderabad | విద్యాశాఖ కీలక నిర్ణయం.. మేధా పాఠశాల లైసెన్స్​ రద్దు.. ఎందుకో తెలుసా?

    Hyderabad | విద్యాశాఖ కీలక నిర్ణయం.. మేధా పాఠశాల లైసెన్స్​ రద్దు.. ఎందుకో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​(Hyderabad) నగరంలోని సికింద్రాబాద్​ పరిధిలో గల ఓల్డ్​ బోయిన్​పల్లి మేధా పాఠశాల లైసెన్స్​ను రద్దు చేస్తూ విద్యాశాఖ(Education Department) కీలక నిర్ణయం తీసుకుంది.

    పాఠశాలలో నిషేధిత మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం ఈగల్​ టీమ్(Eagle Team)​ పాఠశాలపై దాడులు చేపట్టింది. కల్తీ కల్లు తయారీలో వినియోగించే అల్ప్రాజోలం పాఠశాలలో తయారు చేస్తున్నట్లు గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంతో తాజాగా విద్యాశాఖ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేధా స్కూల్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

    Hyderabad | స్కూల్​ సీజ్​

    మేధా స్కూల్‌(Medha School)లో పది కిలోల మత్తు మందు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాఠశాల డైరెక్టర్​ను అదుపులోకి తీసుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌ తయారుచేసి అమ్మినట్లు గుర్తించారు. దీంతో ఇప్పటికే పాఠశాలను అధికారులు సీజ్​ చేశారు. తాజాగా లైసెన్స్​ రద్దు చేయడంతో బడిలోని విద్యార్థులను మరో స్కూల్లో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థులు ఇబ్బందులు కల్గకుండా.. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఈగల్​ టీమ్​ చర్యలు చేపట్టింది.

    Hyderabad | 8 రియాక్టర్లు..

    మేధా పాఠశాలలలో డైరెక్టర్​ జయప్రకాశ్​ గౌడ్​ డ్రగ్స్ తయారీ కోసం 8 రియాక్టర్లు(8 Reactors) ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ తరహాలో రియాక్టర్లు పెట్టాడు. అదే భవనంలో నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు పాఠశాల కొనసాగుతోంది. జీ+2 భవనంలో 6 గదుల్లో స్కూల్.. ఒక వైపు తరగతి గదులు, మరో వైపు డ్రగ్స్ తయారీ నిర్వహిస్తున్నారు. స్కూల్ సెలవు రోజుల్లో జయప్రకాష్ గౌడ్ డ్రగ్స్ విక్రయాలు చేపడుతున్నట్లు ఈగల్​ టీమ్​ పోలీసులు గుర్తించారు.

    More like this

    Manala Mohan Reddy | ఎంపీ అర్వింద్‌ తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టొద్దు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Manala Mohan Reddy | కేంద్రం నుంచి రావాల్సిన యూరియా రాక‌పోవ‌డంతో రైతులు ఇబ్బందులు...

    Fee reimbursement | కాలేజీల బంద్​పై ఉత్కంఠ​.. డిప్యూటీ సీఎంతో భేటీ కానున్న ఫెడరేషన్​ నేతలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fee reimbursement | రాష్ట్రంలోని ఇంజినీరింగ్​, వృత్తి విద్యా కాలేజీల బంద్​పై ఉత్కంఠ నెలకొంది....

    Honey Trap | హానీట్రాప్​లో చిక్కుకున్న యోగా గురువు​.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Honey Trap | తక్కువ కాలంలో డబ్బు సంపాదించడానికి కొందరు వక్రమార్గాలు పడుతున్నారు. హనీట్రాప్(Honey...