More
    HomeతెలంగాణEagle Team | ఈగల్​ టీమ్​ దూకుడు.. రాష్ట్రవ్యాప్తంగా దాడులు.. భారీగా గంజాయి​ స్వాధీనం

    Eagle Team | ఈగల్​ టీమ్​ దూకుడు.. రాష్ట్రవ్యాప్తంగా దాడులు.. భారీగా గంజాయి​ స్వాధీనం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | డ్రగ్స్​ దందా నిర్మూలనే లక్ష్యంగా ఈగల్​ టీమ్​ చర్యలు చేపడుతోంది. ఇటీవల డ్రగ్స్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో ఆదివారం స్పెషల్​ ఆపరేషన్​(Special Operation) చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేపట్టింది.

    డ్రగ్స్​ దందాపై ఈగల్​ టీమ్(Eagle Team)​ ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్​ నగరంలో డ్రగ్స్​ తయారీ, విక్రయాలపై దాడులు చేపట్టి ఇప్పటికే పలువురిని అరెస్ట్​ చేసింది. ముంబై, పూణేలో సైతం స్పెషల్ ఆపరేషన్​ను చేపట్టి హవాలా నెట్​వర్క్​ను ఛేదించింది. అంతేగాకుండా డెకాయి ఆపరేషన్లు(Decoy Operations) నిర్వహించి మత్తుపదార్థాలకు బానిసలుగా మారిన వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్​ సైతం ఇస్తోంది. తాజాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈగల్​ టీమ్​ స్థానిక పోలీసుల సాయంతో దాడులు చేపట్టింది.

    Eagle Team | రైల్వే స్టేషన్​లలో..

    ఈగల్‌, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌, L&O పోలీసులు ఆదివారం సంయుక్త దాడులు చేపట్టారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station)లో నలుగురు డ్రగ్‌ పెడ్లర్ల అరెస్టు చేశారు. వారి నుంచి 91 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న మరో ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు. వారి వద్ద 5 కేజీల గంజాయి పట్టుకున్నారు. వరంగల్‌లో కొణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు(Konark Express Train)లో  ముగ్గురిని అదుపులోకి తీసుకొని 32 కేజీల గంజాయి పట్టుకున్నారు.

    Eagle Team | అల్ప్రాజోలం పట్టివేత

    ములుగు జిల్లా(Mulugu District) వాజేడులో పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి రూ. 7.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వరంగల్ ఐనవోలు పరిధిలో ఓ ఫెడ్లర్​ను అరెస్టు చేసి రూ.53.5 లక్షల విలువైన 214 కిలోల గంజాయి పట్టుకున్నారు. సంగారెడ్డిలో అల్ప్రాజోలం తయారీ కేంద్రంలో దాడులు చేపట్టారు. 270 గ్రాముల అల్ప్రాజోలం(270 Grams Alprazolam), 7.890 కేజీల నోర్డయాజిపామ్ స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈగల్​ టీమ్​, పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి.

    More like this

    Manala Mohan Reddy | ఎంపీ అర్వింద్‌ తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టొద్దు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Manala Mohan Reddy | కేంద్రం నుంచి రావాల్సిన యూరియా రాక‌పోవ‌డంతో రైతులు ఇబ్బందులు...

    Fee reimbursement | కాలేజీల బంద్​పై ఉత్కంఠ​.. డిప్యూటీ సీఎంతో భేటీ కానున్న ఫెడరేషన్​ నేతలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fee reimbursement | రాష్ట్రంలోని ఇంజినీరింగ్​, వృత్తి విద్యా కాలేజీల బంద్​పై ఉత్కంఠ నెలకొంది....

    Honey Trap | హానీట్రాప్​లో చిక్కుకున్న యోగా గురువు​.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Honey Trap | తక్కువ కాలంలో డబ్బు సంపాదించడానికి కొందరు వక్రమార్గాలు పడుతున్నారు. హనీట్రాప్(Honey...