More
    HomeతెలంగాణJubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికపై కాంగ్రెస్​ ఫోకస్​.. నేడు సీఎం కీలక సమావేశం

    Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికపై కాంగ్రెస్​ ఫోకస్​.. నేడు సీఎం కీలక సమావేశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో(Jubilee Hills by Election) గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్​ పావులు కదుపుతోంది. ఇప్పటికే హైదరాబాద్​ ఇన్​ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​ నియోజకవర్గంలో పలుమార్లు పర్యటించారు.

    జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే(Jubilee Hills MLA)గా బీఆర్​ఎస్​ నుంచి గెలుపొందిన మాగంటి గోపినాథ్​ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. బీహార్​ ఎలక్షన్లతో పాటు జూబ్లీ హిల్స్​ స్థానానికి సైతం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ స్థానంలో గెలుపు కోసం కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

    Jubilee Hills | సీఎం సమావేశం

    జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్(PCC Cheif Mahesh Kumar Goud)​, మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్​ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించనున్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్​ పాలనకు రెఫరండంగా భావించే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్​ నాయకులు ఈ స్థానంలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.

    Jubilee Hills | అభ్యర్థి ఎవరో?

    హైదరాబాద్​ ఇన్​ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)​ ఇప్పటికే పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించారు. స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అయితే ఈ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. గతంలో మాజీ ఎంపీ అజారుద్దీన్​ పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. అయితే కాంగ్రెస్​ ఆయనను గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపీక చేసింది. దీంతో జూబ్లీహిల్స్​ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపుతారనే ఉత్కంఠ నెలకొంది.

    Jubilee Hills | బీజేపీ, బీఆర్​ఎస్​ సైతం

    తమ సిట్టింగ్​ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్​ఎస్​(BRS) భావిస్తోంది. మాగంటి గోపినాథ్​ చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కేటీఆర్​ కార్యకర్తలకు సూచించారు. ఇటీవల ఆయన నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. మరోవైపు బీజేపీ సైతం ఈ సీటు గెలుచుకొని నగరంలో పట్టు పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్(Hyderabad)​ పరిధిలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఉన్న ఎమ్మెల్యే రాజా సింగ్​ రాజీనామా చేశారు. గతంలో నగరంలో మంచి పట్టున్న బీజేపీకి ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం గమనార్హం. దీంతో జూబ్లీహిల్స్​ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కమలం పార్టీ యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటించారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.

    More like this

    Manala Mohan Reddy | ఖబడ్దార్ అర్వింద్‌.. తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టొద్దు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Manala Mohan Reddy | కేంద్రం నుంచి రావాల్సిన యూరియా రాక‌పోవ‌డంతో రైతులు ఇబ్బందులు...

    Fee reimbursement | కాలేజీల బంద్​పై ఉత్కంఠ​.. డిప్యూటీ సీఎంతో భేటీ కానున్న ఫెడరేషన్​ నేతలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fee reimbursement | రాష్ట్రంలోని ఇంజినీరింగ్​, వృత్తి విద్యా కాలేజీల బంద్​పై ఉత్కంఠ నెలకొంది....

    Honey Trap | హానీట్రాప్​లో చిక్కుకున్న యోగా గురువు​.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Honey Trap | తక్కువ కాలంలో డబ్బు సంపాదించడానికి కొందరు వక్రమార్గాలు పడుతున్నారు. హనీట్రాప్(Honey...