అక్షరటుడే, వెబ్డెస్క్ : Speaker Om Birla | మహిళల భాగస్వామ్యం లేనిదే ఏ దేశం కూడా అభివృద్ధి చెందదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. భారతీయ సమాజంలో తొలి నుంచి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్న ఆయన.. దేశ అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని తిరుపుతిలో ఆదివారం నిర్వహించిన జాతీయ మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో స్పీకర్ ప్రసంగించారు. మహిళలకు గౌరవం ఇవ్వడం భారతదేశ సంప్రదాయమని గుర్తు చేశారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదని చెప్పుకొచ్చారు. మహిళల అభివృద్ధికి రాజ్యాంగం అనేక నిబంధనలు రూపొందించిందని గుర్తుచేశారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు(Womens Reservations) కల్పిస్తున్నట్లు చెప్పారు.
Speaker Om Birla | తొలి నుంచి మహిళల పాత్ర కీలకం..
నాటి కాలం నుంచి మహిళల పాత్ర(Womens Role) అన్నింటా కీలకంగా ఉందని స్పీకర్ గుర్తు చేశారు. ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారన్నారు. సామాజిక బంధనాలను ఛేదించుకుని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పారు. మహిళల పాత్ర గుర్తించే రాజ్యాంగంలో వారికోసం అనేక నిబంధనలు పొందు పరిచారన్నారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ ఉద్యమమైనా, అభివృద్ధి కార్యక్రమమైన విజయం సాధించలేదని చెప్పారు. మహిళా శక్తి కారణంగానే ఇవాళ భారత్ ప్రపంచంలో ముందువరుసలో ఉందన్నారు.
Speaker Om Birla | సాధికారత ఒక్కరోజులో సాధ్యం కాదు..
భారత భూమిలో మహిళా భాగస్వామ్యం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇవాళ అనేక రంగాల్లో నాయకత్వ స్థానాల్లో అతివలే ఉన్నారని, రాజకీయ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, సైన్యంలో మహిళలు కీలకపాత్ర పోషించే స్థాయికి చేరారన్నారు. ఆదివాసీ మహిళ ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్నారని గుర్తు చేశారు. మహిళా సాధికారత ఒకరోజులో సాధ్యం కాదని స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla) స్పష్టం చేశారు. అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటేనే మహిళా సాధికారత సాధించగలమన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేసినట్లు చెప్పారు.