అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indigo Flight | పైలట్ అప్రమత్తతతో ఘోర విమాన ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న విమానం ఎంతకీ టేకాఫ్ కాలేదు.
గమనించిన పైలట్ వేగంగా స్పందించి ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ (MP Dimple Yadav) సహా 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. శనివారం లక్నో (Luknow) విమానాశ్రయంలో ఢిల్లీ (Delhi)కి వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E2111 రన్‌వేపై నుంచి బయల్దేరింది. అయితే, వేగం పుంజుకున్న విమానం గాలిలోకి లేవాల్సి ఉండగా, లేవలేక పోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్‌తో సహా 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కూడిన విమానం ఘోర ప్రమాదానికి గురయ్యేది. చివరి క్షణంలో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Indigo Flight | వేగంగా స్పందించిన పైలట్
టేకాఫ్ కోసం వేగం పెరుగుతున్నప్పటికీ, విమానం పైకి లేవలేకపోయింది. ఇది గమనించిన పైలట్ (Pilot) రన్‌వే చివరలో అత్యవసర బ్రేక్‌లను ప్రయోగించి, విమానాన్ని విజయవంతంగా నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పైలట్‌ను విమానయాన అధికారులు, ప్రయాణికులు ప్రశంసించారు.
Indigo Flight | భయాందోళనకు గురైన ప్రయాణికులు
ఆకస్మికంగా విమానం నిలిపివేయడంతో ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. అయితే, కానీ చిన్న గాయాలు లేకుండా అంతా బయటపడ్డారని ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఈ విమానంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ డింపుల్ యాదవ్ ఉన్నారని తర్వాత తెలిసింది. ఆమె, ఇతర ప్రయాణీకులు మరియు సిబ్బందితో పాటు సురక్షితంగా ఉన్నారని తెలియడంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.