More
    HomeతెలంగాణRSS | ప్రతి హిందువు స్వయం సేవక్​గా తయారు కావాలి

    RSS | ప్రతి హిందువు స్వయం సేవక్​గా తయారు కావాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు : RSS | ప్రతి హిందువును స్వయంసేవక్​గా తయారు చేయడమే శతాబ్ది ఉత్సవాల లక్ష్యమని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ్​ చాలక్​ డాక్టర్ కాపర్తి గురుచరణం అన్నారు.

    ఆర్ఎస్ఎస్ కంఠేశ్వర్ (Kanteswar), నాందేవ్​వాడ (Nandevvada) ఉపనగరాల సాంఘిక్ కార్యక్రమం న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయదశమి నుంచి ఏడాది పాటు ప్రతి హిందూ ఇంటిని కలవడం, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కార్యక్రమాల గురించి వివరిస్తామన్నారు.

    RSS | వ్యక్తి మారితేనే..

    వ్యక్తి మారితేనే సమాజం మారుతుందని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ (Dr. Hedgewar) సూచించారని గుర్తు చేశారు. ప్రతి వ్యక్తిని దేశభక్తుడిగా.. శ్రేష్టమైన హిందువుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా వందేళ్ల ప్రయాణాన్ని కొనసాగించామన్నారు. వ్యక్తి బాగుంటే కుటుంబం.. కుటుంబం బాగుంటే సమాజం.. సమాజం బాగుంటే దేశం బాగుంటుందని మూల సూత్రాన్ని అర్థం చేయించడానికి దేశవ్యాప్తంగా జన జాగరణ చేయనున్న పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో నగర కార్యవాహ అర్గుల సత్యం, నగర ఉప కార్యవాహ మధుకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    GST Reforms | జీఎస్టీ రిఫార్మ్స్‌ ఎఫెక్ట్‌..! ఏ టూవీలర్‌ రేటు ఎంత తగ్గిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో వాహనాల...

    Airfloa Rail Technology | లిస్టింగ్‌ రోజే పెట్టుబడి డబుల్‌ అవ్వనుందా?.. ఆసక్తి రేపుతున్న ఎస్‌ఎంఈ ఐపీవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Airfloa Rail Technology | స్టాక్‌ మార్కెట్‌లో ఐపీవో(IPO)ల సందడి కొనసాగుతోంది. ఓ ఎస్‌ఎంఈ(SME)...

    Kamareddy | కన్నతల్లిని హత్య చేసిన కసాయి కొడుకు అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే అపరిశుభ్రం చేస్తోందని తల్లిని తీసుకెళ్లి నదిలో తోసేసి...