More
    HomeసినిమాRam Charan - Upasana | సెకండ్ బేబి గురించి ఉపాస‌న షాకింగ్ కామెంట్స్.. త్వ‌ర‌లోనే...

    Ram Charan – Upasana | సెకండ్ బేబి గురించి ఉపాస‌న షాకింగ్ కామెంట్స్.. త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ram Charan – Upasana | తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరుగాంచిన రామ్ చరణ్ – ఉపాసన (Ram Charan – Upasana) దంపతులు తాజాగా మళ్లీ వార్తల్లోకెక్కారు. ఇటీవలే తల్లిదండ్రులుగా మారిన ఈ జంట.. ఇప్పుడు రెండో బిడ్డ (Second Birth) కోసం రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తుంది.

    ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మొదటి బిడ్డ విష‌యంలో ఆలస్యం చేశాము. కానీ రెండో బిడ్డ‌ విషయంలో అలాంటి తప్పు చేయకూడదని నిశ్చయించుకున్నాం. ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను.. త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్ వ‌స్తుంది” అని చెప్పిన ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారాయి. గతంలో ఉపాసన లేట్‌గా బిడ్డ‌ని క‌న‌డం విష‌యంలో కొందరు విమర్శించినా, ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు క్లీన్ క్లారా రాకతో మెగా కుటుంబం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.

    Ram Charan – Upasana | మ‌రో గుడ్ న్యూస్..

    క్లీన్ క్లారా (Klin Kaara) పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఫేస్ రివీల్ చేయ‌లేదు.ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తారా అని అంద‌రు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్ ఒక‌వైపు హీరోగా రాణిస్తూనే మ‌రోవైపు నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలను అందించిన విష‌యం తెలిసిందే.

    ఇక‌ ఇప్పుడు హైదరాబాద్‌లో (Hyderabad) ఓ లగ్జరీ మల్టీప్లెక్స్‌ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి విధులు ఉపాసన చేతిలో పెట్టాలని చరణ్ భావిస్తున్నారట. అపోలో గ్రూప్‌లో ఇప్పటికే అనేక బిజినెస్‌లను విజయవంతంగా నిర్వహిస్తున్న ఉపాసన ఈ మల్టీప్లెక్స్‌ను అత్య‌ద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్న‌ట్టు తెలుస్తుంది

    రామ్ చరణ్ – ఉపాసన జంట ఒకవైపు ఫ్యామిలీ ప్లానింగ్, మరోవైపు నూతన వ్యాపారాల్లోకి అడుగులు వేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ చివ‌రిగా గేమ్ ఛేంజ‌ర్ చిత్రంతో (Game Changer Movie) బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ ఫ్లాప్ మూట‌గ‌ట్టుకున్నారు. అయితే ఇప్పుడు బ‌డా హిట్ కొట్టాల‌నే ఉద్దేశంతో బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇందులో జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor) క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వ‌చ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

    More like this

    GST Reforms | జీఎస్టీ రిఫార్మ్స్‌ ఎఫెక్ట్‌..! ఏ టూవీలర్‌ రేటు ఎంత తగ్గిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో వాహనాల...

    Airfloa Rail Technology | లిస్టింగ్‌ రోజే పెట్టుబడి డబుల్‌ అవ్వనుందా?.. ఆసక్తి రేపుతున్న ఎస్‌ఎంఈ ఐపీవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Airfloa Rail Technology | స్టాక్‌ మార్కెట్‌లో ఐపీవో(IPO)ల సందడి కొనసాగుతోంది. ఓ ఎస్‌ఎంఈ(SME)...

    Kamareddy | కన్నతల్లిని హత్య చేసిన కసాయి కొడుకు అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే అపరిశుభ్రం చేస్తోందని తల్లిని తీసుకెళ్లి నదిలో తోసేసి...