ePaper
More
    HomeజాతీయంPakistan | ఉగ్ర‌వాదుల‌తో సంబంధాలు నిజ‌మే.. మ‌రోసారి అంగీక‌రించిన పాకిస్తాన్‌

    Pakistan | ఉగ్ర‌వాదుల‌తో సంబంధాలు నిజ‌మే.. మ‌రోసారి అంగీక‌రించిన పాకిస్తాన్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Pakistan | ప‌హ‌ల్​గామ్(Pahalgam) ఘ‌ట‌న త‌ర్వాత అన్ని వైపులా నుంచి తీవ్ర ఒత్తిళ్లు పెరుగుతున్న నేప‌థ్యంలో పాకిస్తాన్ త‌న త‌ప్పుల‌ను అంగీక‌రిస్తోంది. భార‌త్(india) దాడి చేస్తుంద‌న్న భ‌యంతో వ‌ణికిపోతున్న దాయాది.. ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో సంబంధాలు ఉన్న‌ది వాస్త‌వమేన‌ని చెబుతోంది. ఉగ్ర‌వాదుల‌ను(Terrorists) పెంచి పోషిస్తున్నది నిజ‌మేన‌ని ఇటీవ‌లే ఆ దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్(Khawaja Asif) అంగీక‌రించ‌గా, తాజాగా పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్‌, మాజీ ర‌క్ష‌ణ శాఖ మంత్రి బిలోవాల్ భుట్టో(Bilowal Bhutto) కూడా ఇదే అంశాన్ని పున‌రుద్ఘాటించారు. ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పాటు ఆర్థిక‌ సాయం కూడా అందించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

    Pakistan | గ‌త‌మంతా ర‌హ‌స్య‌మేమీ కాదు..

    ఉగ్రవాదుల‌ విష‌యంలో పాకిస్తాన్‌(Pakistan)కు గ‌తం ఉంద‌నేది ర‌హ‌స్యం కాద‌ని మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో(Bilowal Bhutto) అన్నారు. మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో ముజాహిదీన్‌లకు నిధులు సమకూర్చడంలో, మద్దతు ఇవ్వడంలో పాకిస్తాన్ చురుకైన పాత్రను కూడా భుట్టో ఎత్తి చూపారు. “మేము పాశ్చాత్య దేశాల‌ సహకారంతో అలా చేసామ‌ని” ఆయన అన్నారు.

    Pakistan | పాక్ చాలానే న‌ష్ట‌పోయింది..

    ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఆ త‌ర్వాత తీవ్ర చిక్కుల్లో ప‌డింద‌ని బెన‌జీర్ భుట్టో తెలిపారు. ఉగ్రవాదం వ‌ల్ల పాకిస్తాన్ న‌ష్ట‌పోయింద‌న్నారు. ఇందులో మనం పాల్గొనాల్సింది కాద‌న్నారు. “ఇది మన చరిత్రలో దురదృష్టకర భాగం అనేది నిజం.. దాని ద్వారా మనం పాఠాలు కూడా నేర్చుకున్నాము” అని ఆయన అన్నారు. అయితే, పాకిస్తాన్‌లో ప్రతిరోజూ ఉగ్రవాద దాడులను(Terrorist Attacks) చూశామని, కానీ త‌ర్వాత ఉగ్ర‌వాద సంస్థ‌లపై తీవ్రమైన చర్యలు తీసుకున్నామ‌ని చెప్పారు. ఉగ్ర‌వాద స‌మ‌స్య ప‌రిష్కారానికి అంతర్గ‌త సంస్క‌ర‌ణ‌లు చేపట్టామ‌న్న ఆయ‌న‌.. పాకిస్తాన్ తీవ్ర‌వాద చ‌రిత్ర తిర‌స్క‌రించ‌లేనిద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, అది ముగిసిన అధ్యాయ‌మ‌ని, చ‌రిత్ర‌లో ఒక దురదృష్ట‌క‌ర‌మైన భాగ‌మ‌ని తెలిపారు.

    More like this

    Nepal | నేపాల్‌లో భ‌యాన‌క దృశ్యాలు.. తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో ఇటీవల సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం, రాజకీయ అవినీతి,...

     AP Government | ఏపీలో 60ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. ద‌ర‌ఖాస్తు ఫీజు కూడా లేద‌ట‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Government | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) సీనియర్ సిటిజన్ల కోసం జారీ చేసే...

    Stock Market | స్తబ్దుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Domestic Stock Market) స్తబ్ధుగా సాగుతోంది. స్వల్ప...