అక్షరటుడే, వెబ్డెస్క్ : HDFC | ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ (HDFC Bank) సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హెచ్డీఎఫ్సీ కస్టమర్లు యూపీఐ లావాదేవీలు (UPI transactions) చేయలేకపోతున్నారు. యూపీఐ ద్వారా సదరు బ్యాంక్ నుంచి లావాదేవీలు చేస్తే టెక్నికల్ ప్రాబ్లంతో ఫెయిల్ అవుతున్నాయి. దీంతో వినియోగదారులు రిపోర్టు చేస్తున్నారు. సోషల్ మీడియా (Social Media) లో సైతం దీని గురించి పోస్టులు పెడుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొంది. కనీసం బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా చేసుకోలేకపోతున్నామని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
HDFC | స్పందించని బ్యాంక్
అయితే సాంకేతిక సమస్యలపై హెచ్డీఎఫ్సీ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా సెప్టెంబర్ 13 రాత్రి 12:00 నుంచి ఉదయం 1:30 వరకు మెయింటెన్స్ పనులతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవల్లో అంతరాయం కలుగుతుందని సంస్థ ప్రకటించింది. వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, విశ్వసనీయతను మెరుగుపరచడం, సున్నితమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా మెయింటెనెన్స్ చేపడుతున్నట్లు బ్యాంక్ తెలిపింది. HDFC బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయబడిన UPI సేవలు 90 నిమిషాల పాటు అందుబాటులో ఉండవని బ్యాంక్ తన కస్టమర్లకు తెలియజేసింది.
అయితే ఆదివారం సైతం సేవల్లో అంతరాయం కలగడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక కారణాలతో లావాదేవీలు ఫెయిల్ అవుతున్నట్లు తెలిసింది. అయితే బ్యాంక్ ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించే అవకాశం ఉంది.