అక్షరటుడే, వెబ్‌డెస్క్: Auto Drivers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra pradesh Government) ఇటీవల ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు (Drivers) రూ.15,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ఇచ్చిన ఆదేశాల మేరకు రవాణా శాఖ ఈ పథకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఆటో మిత్ర పథకం కింద ఆటో, మోటార్ క్యాబ్ యాజమానులు (auto and motor cab owners) మరియు డ్రైవర్లు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ ఆర్థిక సాయం అందనుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అమలైన ‘వాహన మిత్ర’ పథకం (Vahana Mitra scheme) కింద రూ.10వేలు అందించగా, ఇప్పుడు రూ.15,000కు పెంచుతూ టీడీపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
13 సెప్టెంబర్ 2025 నాటి వరకు ఉన్న పాత లబ్ధిదారుల జాబితాని పరిగణనలోకి తీసుకుంటారు. కొత్త దరఖాస్తులకు అవకాశం 17 నుంచి 19 సెప్టెంబర్ 2025 వరకు ఇచ్చారు. 22 సెప్టెంబర్ (September) నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, 24 సెప్టెంబర్ నాటికి తుది జాబితా విడుదల చేస్తారు. 1 అక్టోబర్ 2025న లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15,000 జమ చేయడం జరుగుతుంది.
Auto Drivers | అర్హతలు ఏంటంటే..
* దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
* వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి
– బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలి
* ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లకు తక్కువగా ఉండాలి
* వాహనంపై చలాన్లు, బకాయిలు లేకుండా ఉండాలి.
* ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అర్హులు కారు, కానీ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు మినహాయింపు ఉంటుంది.
వ్యవసాయ భూమి పరిమితులు చూస్తే..మాగాణి అయితే మూడు ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల
లోపు ఉండాలి. మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి.
* పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలాన్ని కలిగి ఉండరాదు
ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం ద్వారా డ్రైవర్లు, యాజమానులు తమ వాహనాల బీమా, ఫిట్‌నెస్, మరమ్మతులు మరియు ఇతర అవసరాలను తీర్చుకోవచ్చు. గతంలో లభించిన వాహన మిత్ర పథకాన్ని మెరుగుపరచి, ఇప్పుడు ఆటో మిత్ర గా (Auto mitra) కొత్త రూపంలో ప్రారంభించనున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జీఎస్‌డబ్ల్యూఎస్‌డీ విభాగం దీనికి సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.