అక్షరటుడే, ఇందల్వాయి: Lorry overturned : నారింజ oranges పండ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో రోడ్డంతా పండ్లు చెల్లాచెదురయ్యాయి.
ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులో 44వ నంబరు జాతీయ రహదారి National Highway No. 44 పై చోటుచేసుకుంది.
అదుపుతప్పిన లారీ ప్రధాన రహదారిపై 15 మీటర్ల కింద ఉన్న సర్వీసు రోడ్డుపై పడిపోయింది. ఆదివారం (సెప్టెంబరు 14) తెల్లవారుజామున లారీలో సమస్య ఏర్పడి అదుపు తప్పింది.
Lorry overturned | స్వల్ప గాయాలు..
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అబ్రాజ్ ఖాన్ స్వల్పంగా గాయపడ్డాడు. మరో వ్యక్తి సుజిత్ కూడా లారీలో ఉన్నాడు.
నారింజ పండ్ల లోడుతో ఉన్న లారీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ బోల్తా పడిన సమయంలో సర్వీస్ రోడ్డులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.