More
    Homeక్రీడలుIndia vs Pakistan | భార‌త్‌-పాక్ మ్యాచ్‌పై త‌గ్గిన ఆస‌క్తి.. ఇంకా అమ్ముడుపోని పూర్తి టికెట్స్...

    India vs Pakistan | భార‌త్‌-పాక్ మ్యాచ్‌పై త‌గ్గిన ఆస‌క్తి.. ఇంకా అమ్ముడుపోని పూర్తి టికెట్స్ .. కార‌ణాలు ఇవేనా?

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: India vs Pakistan | ఆసియా కప్ 2025లో Asia cup 2025 భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. సెప్టెంబరు 14న దుబాయ్ Dubai వేదికగా ఈ రెండు ఆసియా దిగ్గజాల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

    సాధారణంగా ఇండో-పాక్ మ్యాచ్‌కు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టికెట్లు సెకన్లలో అమ్ముడైపోతూ, స్టేడియంలు హౌస్‌ఫుల్ అవుతుంటాయి.

    కానీ ఈసారి మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. గేమ్ ద‌గ్గ‌ర‌పడుతున్నా కూడా టికెట్లు పూర్తి స్థాయిలో అమ్ముడుపోవడం లేదు. పలువురు క్రికెట్ అభిమానులని ఇది ఎంత‌గానో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

    సాధార‌ణంగా ఇండియా-పాక్ మ్యాచ్ అంటేనే భారీ క్రౌడ్, టెన్షన్ ఫుల్ అంబియెన్స్ గుర్తొస్తుంది. కానీ టికెట్ అమ్మకాలపై ప్రస్తుతం కనిపిస్తున్న స్లో రెస్పాన్స్ వెనుక గల కారణాలు ఆసక్తికరంగా మారాయి.

    India vs Pakistan | ప్యాకేజ్ విధానమే కారణమా?

    ఈసారి ఆసియా కప్ నిర్వాహకులు టికెట్ అమ్మకాలకు ‘ప్యాకేజీ సిస్టమ్’ను Package System తీసుకువచ్చారు. దీని ప్రకారం ఒక్క మ్యాచ్‌కి టికెట్ కొనుగోలు చేసే అవకాశం లేదు.

    భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌తో పాటు ఇతర గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను కలిపి ప్యాకేజీగా అమ్ముతున్నారు. టికెట్ కొనుగోలు చేయాలంటే, మొత్తం ప్యాకేజీ తీసుకోవాల్సి వస్తోంది.

    దీంతో ఒక మ్యాచ్ చూడాల‌ని అనుకున్న‌ సామాన్య అభిమానులు వెనక్కి తగ్గుతున్నారు. ప్యాకేజీల్లో టికెట్ల ధరలు ఆశించిన దానికంటే అత్యధికంగా ఉండటం కూడా మరో కారణంగా చెబుతున్నారు.

    రెండు టికెట్లతో కూడిన VIP సూట్ ధర రూ. 2,57,815గా ఉండగా, రాయల్ బాక్స్ రూ. 2,30,700కి చేరింది. స్కై బాక్స్ ఈస్ట్ టికెట్లు ఇద్దరికి రూ. 1,67,851 కాగా, ప్లాటినం సీట్లు రూ. 75,659కి విక్రయిస్తున్నాయి.

    మీడియం రేంజ్‌లో గ్రాండ్ లాంజ్ టికెట్లు రూ. 41,153గా, పెవిలియన్ వెస్ట్ రూ. 28,174గా ఉన్నాయి. ఇక సాధారణంగా ఉండే జనరల్ ఈస్ట్ టికెట్లు కూడా దాదాపు రూ. 10,000కి దగ్గరగా ఉన్నాయి.

    ఈ ధరలు ఎంతో మంది మిడిల్ క్లాస్ Middle Class అభిమానులకు అందనంత దూరంగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. పైగా ఒక్క మ్యాచ్‌కి ఈ మొత్తాన్ని ఖర్చు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు.

    కీలకమైన అంశం ఏమిటంటే, ఈ మ్యాచ్‌కి విరాట్ కోహ్లీ Virat Kohli, రోహిత్ శర్మ Rohit Sharma లాంటి స్టార్ ప్లేయర్లు గైర్హాజరు కావడం. గత పదేళ్లుగా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఈ ఇద్దరి స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ గుర్తొస్తాయి.

    అయితే, ఇప్పుడు ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న నేపథ్యంలో.. ఈ ఇద్దరూ టోర్నీకి దూరంగా ఉన్నారు. ఇప్పటికే రోహిత్, కోహ్లీలు టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన క్రమంలో ఈ మ్యాచ్‌లో వారి గైర్హాజరీతో క్రేజ్ కొంత తగ్గినట్టు భావిస్తున్నారు.

    అయితే ‘టిక్కెట్లు అమ్ముడుపోవట్లేదని వ‌స్తున్న‌ వార్తల్లో వాస్త‌వం లేద‌ని, ప్రస్తుతం పరిస్థితులు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి.. అంటూ రీసెంట్‌గా ఈసీబీ అధికారి ఒకరు జాతీయ మీడియాతో చెప్పుకొచ్చారు.

    More like this

    Bihar Elections | మ‌హాఘ‌ట్ బంధ‌న్‌లో చీలిక‌?.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామ‌న్న తేజ‌స్వీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar Elections | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలుపొందాల‌ని భావిస్తున్న విప‌క్ష...

    Congress | కాంగ్రెస్​ క్రమ శిక్షణ కమిటీ సమావేశం.. రాజగోపాల్​రెడ్డిపై ఏమన్నారంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ సమావేశం ఆదివారం గాంధీ భవన్​లో నిర్వహించారు....

    Asia Cup | భారత్ vs పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్‌పై తీవ్ర వ్యతిరేకత.. ట్రెండింగ్​లో బాయ్​కాట్​ హ్యాష్​ట్యాగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025లో భాగంగా జరగనున్న భారత్ - పాకిస్తాన్...