More
    HomeతెలంగాణTraffic alert | ట్రాఫిక్ అలర్ట్.. హైదరాబాద్​లో నేటి రాత్రి 8 గంట‌ల వరకు ఆంక్షలు.....

    Traffic alert | ట్రాఫిక్ అలర్ట్.. హైదరాబాద్​లో నేటి రాత్రి 8 గంట‌ల వరకు ఆంక్షలు.. ఎక్కడంటే..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Traffic alert | ముస్లింలు నిర్వహించుకునే పవిత్ర పర్వదినం మిలాద్ ఉన్ నబీ Milad-un-Nabi సందర్భంగా నేడు(ఆదివారం, సెప్టెంబరు 14) హైదరాబాద్ Hyderabad నగరంలో భారీ ఊరేగింపు జరగనుంది.

    ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్‌, అసౌకర్యాలు తలెత్తకుండా ఉండేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.

    ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలయ్యే ప్రాంతాలు చూస్తే..

    ఫలక్‌నుమా Falaknuma, ఇంజన్ బౌలి Engine Bowli, నాగుల్‌చింత ఎక్స్‌ రోడ్ Nagulchinta X Road, హిమ్మత్‌పురా జంక్షన్ Himmatpura Junction, ఓల్గా Olga, హరిబౌలి Haribouli, పంచ్ మొహల్లా Panch Mohalla, చార్మినార్ Charminar, గుల్జార్ హౌజ్ Gulzar House, మదీనా జంక్షన్ Medina Junction, పత్తర్ ఘాట్ Pattar Ghat, మీరాలం Miralam, మండీ Mandi, ఎతేబార్ చౌక్ Etebhar Chowk, అలిజా కోట్లా Aliza Kotla, బీబీ బజార్ Bibi Bazaar, వాల్టా హోటల్ Walta Hotel, అఫ్జల్‌గంజ్ టీ జంక్షన్ Afzalganj T Junction, ఉస్మాన్‌గంజ్ Osmanganj, ఎంజే మార్కెట్ జంక్షన్ MJ Market Junction, నాంపల్లి టీ జంక్షన్ Nampally T Junction, హజ్ హౌస్ Haj House, ఏఆర్ పెట్రోల్ AR Petrol Pump పంప్ తదితర ప్రాంతాలు.

    Traffic alert | ఇలా ప్లాన్ చేసుకోండి..

    ఈ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను మళ్లిస్తామని, ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఏడాది మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ప్రధానంగా ఈ మార్గాల్లో జరగనుంది.

    ఫలక్‌నుమా నుంచి చార్మినార్ మీదుగా వాల్టా హోటల్ వరకు, మక్కా మసీద్ నుండి నాంపల్లి Nampally హజ్ హౌస్ వరకు, పత్తర్ ఘాట్ నుండి అలిజా కోట్లా వరక ఉంటుంది.

    ఊరేగింపు జరిగే సమయంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేస్తారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని సూచించారు.

    మిలాద్ ఉన్ నబీను దృష్టిలో ఉంచుకుని, పాతబస్తీలోని పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు వెల్లడించారు.

    ముఖ్యంగా చార్మినార్, మక్కా మసీద్ వంటి ప్రసిద్ధ స్మారక చిహ్నాలు నేడు సందర్శకుల కోసం అందుబాటులో ఉండవని తెలిపారు.

    మదీనా, చార్మినార్, నాంపల్లి ప్రాంతాల్లో వెళ్లే వారు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎక్కువగా వినియోగించాలి.

    ట్రాఫిక్ పోలీసులు సూచించే మార్గదర్శకాలను పాటించాలి. అత్యవసర సేవలకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు Traffic Police ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

    మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలతో పాటు, నగర ప్రజలంతా సహనంతో వ్యవహరిస్తారని పోలీసు శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

    More like this

    Lok Adalat | జాతీయ మెగా లోక్​ అదాలత్​లో జిల్లాకు నాల్గో స్థానం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Lok Adalat | జాతీయ లోక్ అదాలత్​లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో నిజామాబాద్​ జిల్లా...

    Bihar Elections | మ‌హాఘ‌ట్ బంధ‌న్‌లో చీలిక‌?.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామ‌న్న తేజ‌స్వీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar Elections | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలుపొందాల‌ని భావిస్తున్న విప‌క్ష...

    Congress | కాంగ్రెస్​ క్రమ శిక్షణ కమిటీ సమావేశం.. రాజగోపాల్​రెడ్డిపై ఏమన్నారంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ సమావేశం ఆదివారం గాంధీ భవన్​లో నిర్వహించారు....