అక్షరటుడే, వెబ్‌డెస్క్: గూగుల్ తాజాగా విడుదల చేసిన Google Gemini Nano Banana ఏఐ ఇమేజ్ టూల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏఐతో 3D కలెక్టబుల్ ఫిగరిన్‌లా మన ఫోటోను మార్పు చేసే ఈ టూల్ ఇప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 10 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్ సాధించిన ఈ ఫీచర్… ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌గా నిలుస్తోంది. Nano Banana టూల్ ద్వారా, యూజర్లు తమ ఫోటోలను లేదా ఇతర ఇమేజ్‌లను అప్లోడ్ చేసి, వాటిని హైపర్ రియలిస్టిక్ 3D టాయ్‌లా మార్చుకోవచ్చు. చిన్న బొమ్మల్లా కనిపించే ఈ ఫిగరిన్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇప్పుడు ఈ టూల్ తో తయారైన ఫోటోలు Instagram, TikTok, X (Twitter), Facebook లో బాగా వైరల్ అవుతున్నాయి.
Nano Banana | డిఫరెంట్ ప్రాంప్ట్స్‌తో..
బనానా ఏఐ టూల్ Ai Tool స్పెషాలిటీ విషయానికి వస్తే.. 3D బొమ్మల లుక్, యాక్షన్ ఫిగర్ స్టైల్, ఫన్నీ & క్రియేటివ్ కాంపోజిషన్లు, వేగంగా రిజల్ట్స్ ఇస్తుంది. గూగుల్ జెమినీ 2.5 ఆధారంగా మెరుగైన ప్రాసెసింగ్ జరుగుతుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5 వైరల్ ప్రాంప్ట్స్ లో..
ప్రాంప్ట్ 1 : ఫోటోను అప్లోడ్ చేస్తే యాక్షన్ ఫిగర్‌గా రూపొందిస్తుంది. ప్యాకేజింగ్‌తో సహా పూర్తిగా ఒక కలెక్టబుల్ టాయ్‌లా కనిపిస్తుంది.
ప్రాంప్ట్ 2 : వేర్వేరు దశాబ్దాల్లో ఉన్నట్లుగా మార్చుకోవచ్చు . స్టైల్, బట్టలు, హెయిర్ స్టైల్ అన్నీ ఆ కాలానికి అనుగుణంగా మారతాయి.
ప్రాంప్ట్ 3 : టీవీ షో క్యారెక్టర్లుగా మనల్ని మార్చే ఫీచర్. ఫిక్షనల్ క్యారెక్టర్స్ ని కూడా టార్గెట్ చేయొచ్చు.
ప్రాంప్ట్ 4 : ప్రముఖ కళాకృతుల్లో లేదా ప్రముఖులతో మనల్ని కలిపే ప్రాంప్ట్. వాన్ గోస్ స్టారీ నైట్, డాలీ పెయింటింగ్స్ లో కనిపించేలా చేస్తుంది.
ప్రాంప్ట్ 5 : ప్రపంచ ప్రముఖ ప్రదేశాల్లో ఉన్నట్లు చూపే ఫీచర్. టూరిజం లవర్స్‌కి ముద్దుగొలిపే స్టైల్‌లో ఉంటుంది.
ఈ టూల్ ద్వారా ఇప్పటివరకు 200 మిలియన్ల కంటే ఎక్కువ 3D ఫిగరిన్ ఫొటోలు రూపొందించబడ్డాయి. వేగంగా, సరదాగా క్రియేట్ చేసుకోవచ్చునన్న కారణంగా రోజురోజుకూ వాడకాదారుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇది ఎంత వరకు సేఫ్ అనేది చాలా మంది ఆలోచించడం లేదు. ఇది చేసేటప్పుడు చాలా వరకు ఫుల్ యాక్సెస్ Full Access ఇస్తున్నారు. అలా చేయడం వలన మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువ. అలానే మీ ఫొటోలను మిస్ యూజ్ కూడా చేసే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ 3డీ ఇమేజెస్ క్రియేట్ చేసే ముందు ఒకటికి పది సార్లు మీ సేఫ్టీ గురించి కూడా ఆలోచించండి. గూగుల్ అయితే మీ ఫొటోస్ మిస్ యూజ్ అయితే మాకు ఎలాంటి సంబంధం లేదని ముందుగానే హెచ్చరించింది. గూగుల్ జెమినీ ఆధారంగా రూపొందించిన నానో బనానా టూల్ డిజిటల్ క్రియేటివిటీకి కూడా నూతన దిక్సూచి అవుతుంది, కొందరికి చిక్కులు కూడా తీసుకు రానుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.