More
    Homeక్రీడలుJaismine lamboria | బాక్సింగ్ రింగ్‌లో జైస్మిన్ స‌త్తా.. ఫైనల్‌లో ఒలింపిక్ మెడలిస్ట్‌పై గెలుపు.. ప‌సిడి...

    Jaismine lamboria | బాక్సింగ్ రింగ్‌లో జైస్మిన్ స‌త్తా.. ఫైనల్‌లో ఒలింపిక్ మెడలిస్ట్‌పై గెలుపు.. ప‌సిడి ప‌త‌కం కైవసం..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jaismine lamboria | మహిళల 57 కిలోల విభాగం ఫైనల్లో జైస్మిన్, పోలాండ్‌ Poland కు చెందిన జూలియా సెరేమెతా Julia Seremeta ను ఓడించింది.

    జూలియా 2020 ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్న టాప్ క్లాస్ బాక్సర్. అంతటి గొప్ప ఫైటర్‌ను జైస్మిన్ 4-1 స్ప్లిట్ డిసెషిన్‌తో మట్టికరిపించి చరిత్ర సృష్టించింది.

    బౌట్ ప్రారంభంలో జైస్మిన్ jaismine lamboria వెనుకబడినప్పటికీ, చివరి రెండు రౌండ్లలో ఆమె చూపించిన ఫైటింగ్ స్పిరిట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రత్యర్థి కౌంటర్లను సమర్థంగా తిప్పి, ఆఖరి వరకు దూకుడుగా గెలుపు కోసం పోరాడింది.

    Jaismine lamboria | భారత్‌కు తొలి స్వర్ణం

    ఈ విజయంతో జైస్మిన్ లంబోరియా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ World Boxing Championships లో భారత్ తరఫున తొలి స్వర్ణ పతకం గెలిచిన మహిళా బాక్సర్‌గా నిలిచింది.

    ఇప్పటి వరకు భారత బాక్సర్లు ఈ టోర్నీలో పతకాలు గెలుచుకున్నా, గోల్డ్ మెడల్ Gold medal మాత్రం అందుకోలేకపోయారు.

    జైస్మిన్ విజయాన్ని అందరూ హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు. కేంద్ర క్రీడల మంత్రి సహా పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు.

    బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ట్విటర్ వేదిక‌గా స్పందిస్తూ.. “ఇది కేవలం విజయం కాదు… భారత బాక్సింగ్ చరిత్రలో గోల్డెన్ మైల్‌స్టోన్ !” అంటూ కొనియాడింది.

    హరియాణా Haryana లోని భివానీ జిల్లా నుంచి వచ్చిన జైస్మిన్ చిన్న‌ప్ప‌టి నుండి బాక్సింగ్‌పై మ‌క్కువ పెంచుకుంది. ఆయ‌న తాత కూడా బాక్సర్ కావ‌డంతో కుటుంబంలో బాక్సింగ్ Boxing పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది.

    యూత్ టోర్నీల్లో పలు సార్లు మెడల్స్ సాధించిన అనుభవం ఆమెంది. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో దేశానికి స్వర్ణం అందించిన ఘనత సాధించింది.

    ఈ చారిత్రాత్మక విజయం జైస్మిన్‌కు మాత్రమే కాదు.. భారత మహిళా క్రీడాకారిణుల ప్రతిభకు నిలువెత్తు ఉదాహరణ. అటు యువతకు స్ఫూర్తిగా నిలిచే ఘట్టం కూడా.

    More like this

    Hyderabad | పెంపుడు కుక్కలతో వాకథాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | దేశంలో మొదటి సాంకేతిక ఆధారిత ఓమ్నిఛానల్ పెట్ కేర్ బ్రాండ్ జిగ్లీ, జూబ్లీహిల్స్‌లోని...

    Traffic Challans | దేశ వ్యాప్తంగా ఎన్ని చ‌లాన్లు పెండింగ్‌లో ఉన్నాయో తెలిస్తే ఉలిక్కిప‌డ‌తారు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Traffic Challans | దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలాన్ల (traffic challans) విలువ తెలుసుకుంటే...

    Ram Charan – Upasana | సెకండ్ బేబి గురించి ఉపాస‌న షాకింగ్ కామెంట్స్.. త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ram Charan - Upasana | తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరుగాంచిన...