అక్షరటుడే, భిక్కనూరు : hidden treasures | చారిత్రాత్మక ప్రదేశాలు historical places, ఆలయాల్లో temples గుప్త నిధుల కోసం తవ్వకాలకు పాల్పడటం పరిపాటిగా మారింది.
అడ్డదారిలో అందలం ఎక్కాలనుకునే కొందరు ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ.. పురాతన కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. పూర్వీకుల ఆనవాళ్లను తుడిచిపెట్టేస్తున్నారు.
తాజాగా కామారెడ్డి Kamareddy జిల్లా భిక్కనూరు మండలంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు కలకలం రేపింది. మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలో శనివారం (సెప్టెంబరు 13) ఈ ఘటన వెలుగుచూసింది.
గ్రామస్థుల కథనం ప్రకారం.. భిక్కనూరు, ర్యాగట్లపల్లి, మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన సుమారు పది మంది ముఠాగా ఏర్పడ్డారు. ర్యాగట్లపల్లి గ్రామంలోని పురాతన బసవేశ్వర ఆలయం Basaveshwara temple లో శనివారం మధ్యాహ్నం పొక్లెయిన్‌తో తవ్వకాలు చేపట్టారు.
hidden treasures | చుట్టుముట్టి పట్టుకుని..
అదే సమయంలో అటుగా వచ్చిన కొందరు ఈ తతంగాన్ని చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. దీంతో పెద్ద ఎత్తున జనాలు ఆలయం వద్దకు చేరుకోవడంతో ముఠా సభ్యులు వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. చుట్టుముట్టిన గ్రామస్థులను వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
చాలా సంవత్సరాలుగా ఈ ఆలయం వద్ద గుప్త నిధుల కోసం కొందరు తవ్వకాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా గ్రామస్థులు తెలిపారు. తామంతా నిఘా పెట్టి కాపలా కాస్తున్నామన్నారు.
గుప్త నిధుల hidden treasures కోసం తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.