More
    Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad | హైదరాబాద్​లో వర్షం.. భారీగా ట్రాఫిక్​ జామ్

    Hyderabad | హైదరాబాద్​లో వర్షం.. భారీగా ట్రాఫిక్​ జామ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

    రెండు రోజులుగా నగరంలో భారీ వర్షం (Heavy Rains) పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం శేరిలింగంపల్లి, నల్లగండ్ల, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, హఫీజ్‌పేట్, కొండాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్​, బంజరాహిల్స్​, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం పడింది.

    ఎల్​బీ నగర్,  దిల్​సుఖ్ నగర్, మలక్ పేట్, కోటి, అబిడ్స్, లక్డికాపుల్, బషీర్ బాగ్​లో  భారీ వర్షానికి రోడ్ల పై వరద నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్​ జామ్​ (Traffic Jam)తో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మియాపూర్ నుంచి లింగంపల్లి మార్గంలో వాహనాలు స్తంభించిపోయాయి. ఓవైపు వర్షం, మరోవైపు రోడ్డు మధ్యలో జరుగుతున్న డ్రైనేజీల పనుల వల్ల.. చందానగర్ నుంచి మియాపూర్ మార్గంలోనూ ట్రాఫిక్​ నెమ్మదిగా కదులుతోంది.

    Hyderabad | మూసీకి భారీ వరద

    హైదరాబాద్​లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది (Musi River) ఉగ్రరూపం దాల్చింది. ఉస్మాన్​సాగర్​, హిమాయత్​సాగర్​ నిండుకుండలా మారడంతో అధికారులు గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని వదులుతున్నారు. దీంతో నగరంలో మూసీ ఉధృతంగా పారుతోంది. నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

    రోడ్లపై వరద నీరు నిల్వకుండా ట్రాఫిక్​ పోలీసులు, హైడ్రా (Hydraa), జీహెచ్​ఎంసీ (GHMC) సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు.

    More like this

    Hyderabad Drug racket | హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ కలకలం.. బడిలో తయారు చేస్తున్న ప్రిన్సిపల్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Drug racket | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్...

    Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ.. విద్యార్థుల ఘర్షణలకు అడ్డగా మారింది. తరచూ గొడవలు చెలరేగుతున్నాయి....

    Bihar election trains | తెలంగాణ మీదుగా బీహార్ ఎన్నికల రైళ్లు.. అవేమిటంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Bihar election trains | బీహార్​కు నూతన రైళ్లు, పొడిగింపుల పండుగ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో...