అక్షరటుడే, హైదరాబాద్: Chutneys Kitchen | ఆహార ప్రియుల స్వర్గ ధామం హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, ఫుడ్ సెంట్లర్లు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు.
సంపాదనే ధ్యేయంగా.. వినియోగదారుల ఆరోగ్యాన్ని గుళ్ల చేస్తూ ఇష్టారీతి వ్యవహరిస్తున్నాయి కొన్ని యాజమాన్యాలు. పెద్ద మొత్తంలో దోచుకుంటూ ఆహార ప్రియులకు అనారోగ్య వంటకాలు వడ్డించి, వారిస్తున్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఈ విషయం స్పష్టం అవుతోంది. అపరిశుభ్రమైన వాతావరణంలో వంటకాలు వండుతూ ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు.
Chutneys Kitchen | చట్నీస్ రెస్టారెంట్ బాగోతం
మొన్నటికి మొన్న పిస్తా హౌస్ Pista House బాగోతం బయటపడింది. తాజాగా హైక్లాస్ రెస్టారెంట్, ఫుడ్ సెంటర్ చట్నీస్ కిచెన్‌లోనూ అదే బాగోతం వెలుగు చూసింది.
మహా నగరంలోని చట్నీస్ కిచెన్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
బంజారా హిల్స్ Banjara Hills, జూబ్లీహిల్స్ Jubilee Hills లోని కేంద్రాల్లో తనిఖీలు చేపట్టగా.. దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూశాయి. కిచెన్ లోపల అపరిశుభ్రత పరిస్థితులు కనిపించాయి. వంటగదులు దుర్భరంగా ఉన్నాయి.
మురుగు కాలువలు మూసుకుపోయి కంపు కొడుతున్నాయి. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు జిడ్డుగా మారాయి. బొద్దింకలు కిచెన్ అంతటా విలయ తాండవం చేస్తున్నాయి. ఈ తతంగం అంతా అధికారులు రికార్డు చేశారు.
ఆహార పదార్థాల తయారీ విభాగంలో కార్మికులకు మెడికల్ సర్టిఫికెట్లు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఆహార భద్రతా ప్రమాణాలు (FSSAI) పాటించని ఫుడ్ కేంద్రాలకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఆహార నాణ్యత, శుభ్రత పాటించని రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లపై తనిఖీలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.