అక్షరటుడే, కోటగిరి : Pothangal mandal | దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో పోతంగల్ మండల (Pothangal mandal) కేంద్రంలో జరిగిన దొంగతనాలలో అనుమానితులుగా తిరుగుతూ ఉన్న ఇద్దరు మహిళలను కోటగిరి మండల కేంద్రంలోని (Kotagiri mandal center) బస్టాండ్ వద్ద శనివారం పట్టుకుని విచారించారు. దీంతో వారు నేరం ఒప్పుకోవడంతో, వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వారి వద్ద నుంచి 6.9 గ్రాముల బంగారం, 44.51 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోతంగల్ గ్రామానికి చెందిన మొండి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, వారిని బోధన్ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.