More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | రెగ్యులరైజ్ ఎప్పుడు చేస్తారు..

    Kamareddy | రెగ్యులరైజ్ ఎప్పుడు చేస్తారు..

    Published on

    అక్షర టుడే, కామారెడ్డి: Kamareddy | తమను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీని నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ (General Secretary Satyanarayana) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

    హామీ ఇచ్చి రెండేళ్లు గడిచిందని, కానీ అమలు ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామన్న హామీ ఉత్తదేనా అని అన్నారు. క్రమబద్ధీకరణ, పే స్కేలు, 20 శాతం వెయిటేజీ, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా డిమాండ్లను పరిష్కరించాలన్నారు.

    రాష్ట్ర విద్యాశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో 18 ఏళ్లుగా పనిచేస్తున్న 19,600 మంది ఉద్యోగులు తమ జీవనోపాధి కోసం నిరంతరం పోరాడుతున్నారని, కానీ రెగ్యులరైజేషన్ అనే హామీ ఇప్పటికీ నెరవేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

    More like this

    Hyderabad Drug racket | హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ కలకలం.. బడిలో తయారు చేస్తున్న ప్రిన్సిపల్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Drug racket | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్...

    Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ.. విద్యార్థుల ఘర్షణలకు అడ్డగా మారింది. తరచూ గొడవలు చెలరేగుతున్నాయి....

    Bihar election trains | తెలంగాణ మీదుగా బీహార్ ఎన్నికల రైళ్లు.. అవేమిటంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Bihar election trains | బీహార్​కు నూతన రైళ్లు, పొడిగింపుల పండుగ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో...