అక్షర టుడే, ఎల్లారెడ్డి: Jaggareddy | నిజామాబాద్‌లోని స్నేహ సొసైటీకి చెందిన అంధుల పాఠశాలలో (Sneha Society school) ఐదో తరగతి చదువుతున్న వికాస్ నాయక్‌కు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Former MLA Jaggareddy) అన్నారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం (Gandhari mandal) లోంకాతండాకు చెందిన వికాస్ నాయక్ (Vikas Nayak) మూడేళ్ల వయసులోనే అనారోగ్యంతో చూపును కోల్పోయాడు. ఇటీవల బాలుడి తండ్రి సైతం అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో తమను ఆదుకోవాలని తన తల్లి, అమ్మమ్మ, తాతతో కలిసి సంగారెడ్డిలో (Sangareddy) జగ్గారెడిని కలిశారు. దీంతో వెంటనే స్పందించిన జగ్గారెడ్డి రూ.7.50 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
అంధుడైన వికాస్ నాయక్ పాటలు పాడడం, కొమురవెల్లి మల్లన్న, బీరప్ప, రాముడు, సీత, హనుమంతుడి పౌరాణిక గాథలను కథలు, పాటల రూపంలో ధారాళంగా చెప్పడంలో ప్రావీణ్యం పొందాడు. టీవీల్లో వచ్చే కార్టూన్ క్యారెక్టర్ల డైలాగ్‌లను అచ్చు గుద్దినట్లు అనుకరించడంలో నేర్పు పొందాడు.
దీంతో ఈ విషయం తెలిసిన జగ్గారెడ్డి అతని ప్రతిభకు ముగ్ధుడయ్యాడు. తాను సొంతంగా యూట్యూబ్ చానల్ (YouTube channel) పెట్టుకునేందుకు సహకరించాలని వికాస్ నాయక్ జగ్గారెడ్డిని కోరారు. దీంతో అందుకు ఆయన అభినందించి, సహకరిస్తానని హామీ ఇచ్చారు. తన సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చాడు. అనంతరం కారు ఏర్పాటు చేసి వికాస్ నాయక్ కుటుంబాన్ని వారి స్వస్థలానికి పంపించారు.