అక్షరటుడే, ఇందూరు: SRSP | జిల్లాలోని మెండోరా మండలం పోచంపాడ్‌లో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టును (Sriramsagar Project) రాష్ట్ర హైకోర్టు (Highcourt) న్యాయమూర్తులు సందర్శించారు. జస్టిస్ పి సామ్ కోషి(Justice P Sam Koshy), జస్టిస్ సృజన (Justice Srujana)తో కూడిన బృందం శనివారం ప్రాజెక్టును పరిశీలించింది.
నిర్మల్ (Nirmal) జిల్లాలో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఎస్సారెస్పీని (SRSP) సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం, హైకోర్టు జడ్జిలు కలెక్టర్‌తో భేటీ అయ్యారు. ప్రాజెక్టు గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.