అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Uddhav Thackeray | ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లో జరగనున్న నేపథ్యంలో శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆదివారం భారత్, పాకిస్తాన్‌తో తలపడనున్న మ్యాచ్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది.
క్రికెట్ మ్యాచ్ (India vs Pakistan Match) కొనసాగిస్తే తమ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు మహారాష్ట్రలో వీధుల్లోకి వస్తారని ఉద్ధవ్ థాకరే హెచ్చరించారు. శనివారం ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన.. ఆపరేషన్ సిందూర్‌ను (Operation Sindoor) ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని విమర్శించారు. ప్రతి ఇంటి నుంచి మహిళలు ప్రధాని మోదీకి సిందూర్‌ను పంపుతారనన్నారు.
Uddhav Thackeray | రక్తం, క్రికెట్ ఎలా కలువగలవు..
పాకిస్తాన్‌తో (Pakistan) సైనిక సంఘర్షణ సమయంలో రక్తం, నీరు కలిసి ప్రవహించలేవన్న ప్రధాని.. ఇప్పుడు రక్తం, క్రికెట్ ఎలా కలిసి నడుస్తాయని ఉద్దవ్ ప్రశ్నించారు. “రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని మన ప్రధానమంత్రి అన్నారు. మరీ ఇప్పుడు రక్తం, క్రికెట్ ఎలా కలిసి ప్రవహించగలవు. యుద్ధం, క్రికెట్ ఒకే సమయంలో ఎలా ఉంటాయి?” అని ప్రశ్నించారు. “వారు దేశభక్తితో వ్యాపారం చేస్తున్నారు. దేశభక్తి వ్యాపారం డబ్బు కోసమే. ఆ మ్యాచ్ నుంచి వచ్చే డబ్బు అంతా వారికి కావాలనే వారు మ్యాచ్ ఆడబోతున్నారు. రేపు శివసేన (UBT) మహిళా కార్యకర్తలు మహారాష్ట్రలో వీధుల్లోకి వస్తారు. ప్రతి ఇంటి నుంచి సిందూర్‌ను ప్రధాని మోదీకి (PM Modi) పంపబోతున్నారు.” అని తెలిపారు.
Uddhav Thackeray | ఎందుకు బహిష్కరించరు?
మరోవైపు, బీసీసీఐ తీరుపై ఉద్ధవ్ కుమారుడు, శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాకరే విమర్శించారు. ఇటీవల బీహార్‌లోని రాజ్‌గిర్‌లో భారతదేశం నిర్వహించిన పురుషుల హాకీ ఆసియా కప్‌లో ఇండియా పాల్గొనలేదని గుర్తు చేసిన ఆయన.. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లను ఎందుకు బహిష్కరించడం లేదని ప్రశ్నించారు.