అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Star Health | స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు (Policy Holders) అసోషియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (AHPI) షాకింగ్ న్యూస్ చెప్పింది. సదరు సంస్థ చెల్లింపులు సక్రమంగా జరపడం లేదని, క్యాష్‌లెస్ (Cashless) సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది.
దేశంలో ఆరోగ్య బీమా (Health Insurance)కు ఆదరణ పెరిగింది. చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఆరోగ్య బీమా రంగంలో స్టార్ హెల్త్‌కు మంచి వాటా ఉంది. ఈ సంస్థ దేశంలో చాలా నెట్వర్క్ హాస్పిటల్స్‌ను కలిగి ఉంది. అయితే క్యాష్ లెస్ సర్వీసుల విషయంలో స్టార్ హెల్త్ కంపెనీ సక్రమంగా వ్యవహరించడం లేదని ఏహెచ్‌పీఐ పేర్కొంది. చెల్లింపుల విషయంలో సదరు సంస్థ ఆస్పత్రులను ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపింది. ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ 22 నుంచి క్యాష్‌లెస్ సర్వీసులను నిలిపివేస్తామని హెచ్చరించింది.
Star Health | ఆందోళనలో కస్టమర్లు
దేశంలో స్టార్ హెల్త్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీకి చాలా మంది కస్టమర్లు ఉన్నారు. ఈ సంస్థకు నెట్వర్క్ ఆస్పత్రులు అధికంగా ఉండటంతో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ కోసం దీనిని ఎంచుకుంటున్నారు. అయితే క్యాష్‌లెస్ సర్వీసులు నిలిపివేస్తామని ఏహెచ్‌పీఐ హెచ్చరించడంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ అసోసియేషన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 15 వేల ఆస్పత్రులు ఉన్నాయి. అలాంటి అసోసియేషన్ సేవలు నిలిపి వేస్తామనడంతో తమ పరిస్థితి ఏంటని ఇన్సూరెన్స్ తీసుకున్నవారు ఆలోచిస్తున్నారు.
Star Health | ఫిర్యాదులు అందడంతో..
స్టార్ హెల్త్ సంస్థకు సంబంధించిన చెల్లింపుల విషయంలో తమకు ఫిర్యాదులు వచ్చినట్లు అసోసియేషన్ తెలిపింది. దీంతో సెప్టెంబర్ 22 నుంచి స్టార్ హెల్త్ పాలసీదారులకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ సౌకర్యాన్ని నిలిపివేస్తామని ఏహెచ్‌పీఐ స్పష్టం చేసింది. కాగా గతంలో కూడా ఈ అసోసియేషన్ బజాజ్ అలైంజ్ జనరల్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో కంపెనీలకు సైతం ఇలాంటి హెచ్చరికలు జారీ చేసింది. ఆ కంపెనీలు అసోసియేషన్‌తో చర్చలు జరపడంతో సమస్య పరిష్కారం అయింది. మరి స్టార్ హెల్త్ సంస్థ చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Star Health | స్పందించి స్టార్ హెల్త్
ఏహెచ్‌పీఐ హెచ్చరికలపై స్టార్ హెల్త్ కంపెనీ స్పందించింది. క్యాష్‌లెస్ సేవలు నిలిపివేస్తున్నట్లు తమతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న ఆస్పత్రుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొంది. అసోసియేషన్ తీరు పాలసీదారులను అయోమయానికి గురి చేసేలా ఉందని తెలిపింది.