ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​NHPC Notification | ఎన్‌హెచ్‌పీసీలో ఉద్యోగావకాశాలు

    NHPC Notification | ఎన్‌హెచ్‌పీసీలో ఉద్యోగావకాశాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : NHPC Notification | నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌(NHPC)లో 248 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జూనియర్‌ ఇంజినీర్‌(Junior Engineer) (నాన్‌ ఎగ్జిక్యూటివ్‌) పోస్టులు భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌(Notification) వివరాలిలా ఉన్నాయి.

    భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 248.

    పోస్టుల వివరాలు :

    అసిస్టెంట్‌ రాజ్‌భాషా ఆఫీసర్‌ -11.
    జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌) -109.
    ఎలక్ట్రికల్‌ -46.
    మెకానికల్‌ -49.
    ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ -17.
    సూపర్‌వైజర్‌ (ఐటీ) -1.
    సీనియర్‌ అకౌంటెంట్‌ -10.
    హిందీ ట్రాన్స్‌లేటర్‌ -5.

    విద్యార్హతలు :

    అసిస్టెంట్‌(Assistant) రాజ్‌భాషా ఆఫీసర్‌ : హిందీలో మాస్టర్స్‌, గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌ చేసి, గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో హిందీ ఒక సబ్జెక్టుగా చదివివుండాలి. మూడేళ్ల పని అనుభవం అవసరం.

    జూనియర్‌ ఇంజినీర్‌  : సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌(Electronics and communication) బ్రాంచిలో ఇంజినీరింగ్‌ డిప్లొమా చేసినవారు అర్హులు బీటెక్‌/బీఈ చేసినా డిప్లొమా చేయకపోతే అర్హత లేదు.

    సూపర్‌వైజర్‌ (ఐటీ) : డీవోఈఏసీసీ ఏ లెవెల్‌ కోర్సుతో డిగ్రీ/ 60 శాతంతో కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ పాలిటెక్నిక్‌ డిప్లొమా లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ).
    సీనియర్‌ అకౌంటెంట్‌ : సీఏ ఇంటర్‌/ సీఎంఏ ఇంటర్‌.
    హిందీ ట్రాన్స్‌లేటర్‌ : హిందీలో మాస్టర్స్‌, డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా చదివివుండాలి. ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌, డిగ్రీ స్థాయిలో హిందీ ఒక సబ్జెక్టుగా చదివివుండాలి. ఏడాది ఉద్యోగానుభవం.

    వయోపరిమితి : 30 ఏళ్లలోపు వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)- మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

    వేతనం :
    అసిస్టెంట్‌ రాజ్‌భాషా ఆఫీసర్‌ : రూ.40,000 – రూ. 1,40,000.
    జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌), సూపర్‌వైజర్‌ (ఐటీ), సీనియర్‌ అకౌంటెంట్‌ : రూ. 29,600 – రూ. 1,19,500.
    హిందీ ట్రాన్స్‌లేటర్‌ : రూ. 27,000 – రూ. 1,05,000.

    దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
    దరఖాస్తు ఫీజు : రూ. 708 (108 బ్యాంకు చార్జీలు, జీఎస్టీతో కలిపి). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికోద్యోగులకు దరఖాస్తు ఫీజు లేదు.
    దరఖాస్తు గడువు : అక్టోబర్‌ 1.

    ఎంపిక : కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(CBT) నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికిీ పావు మార్కు తగ్గిస్తారు.

    పూర్తి వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ http://www.nhpcindia.com/ లో సంప్రదించగలరు.

    More like this

    Lingampet | విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని మండల బీజేపీ (Lingampet BJP)...

    Hydraa | రూ.500 కోట్ల విలువైన భూమి కబ్జా.. షాకిచ్చిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో హైడ్రా దూకుడుగా...

    Bigala Ganesh Gupta | కిరణ్​కుమార్​ గౌడ్​కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బిగాల

    అక్షరటుడే, ఇందూరు: Bigala Ganesh Gupta | ప్రముఖ న్యాయవాది కిరణ్​కుమార్​ గౌడ్​ శుక్రవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన...