ePaper
More
    HomeజాతీయంMaoists Surrender | లొంగిపోయిన మావోయిస్ట్​ కీలక నేత సుజాతక్క

    Maoists Surrender | లొంగిపోయిన మావోయిస్ట్​ కీలక నేత సుజాతక్క

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists Surrender | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కీలక నేత సుజాతక్క శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.

    ఆపరేషన్​ కగార్(Operation Kagar)​తో కకావికలం అవుతున్న మావోయిస్ట్​లను లొంగుబాట్లు తీవ్ర కలవర పెడుతున్నాయి. ఓ వైపు ఎన్​కౌంటర్లలో వందలాది మంది దళ సభ్యులు చనిపోతుండగా.. మరోవైపు కీలక నేతలు సైతం ఉద్యమాన్ని వీడుతున్నారు. తాజాగా మావోయిస్ట్​ సెంట్రల్ కమిటీ(Maoist Central Committee) సభ్యురాలిగా కొనసాగుతున్న సూజాతక్క లొంగిపోయారు.

    Maoists Surrender | 106 కేసుల్లో నిందితురాలు

    గద్వాలకు చెందిన సుజాతక్క అలియాస్‌ పోతుల కల్పన ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతున్నారు. ఆమె కీలక ఆపరేషన్లలో పాలు పంచుకున్నారు. అంతేగాకుండా మావోయిస్ట్​ అగ్రనేత కిషన్​జీని 1984లో కిషన్‌జీని పెళ్లి చేసుకున్నారు. సూజాతక్క 106 కేసుల్లో నిందితురాలిగా ఉండగా.. ఆమెపై రూ.కోటి రివార్డు ఉంది. ఆమెతో పాటు మరికొంత మంది దళ సభ్యులు సైతం శనివారం లొంగిపోయినట్లు సమాచారం.

    Maoists Surrender | ఏకైక మహిళ నాయకురాలు

    మావోయిస్ట్(Maoists)​ పార్టీ సెంట్రల్ కమిటీలో ఉన్న ఏకైక మహిళ నేత సుజాతక్క కావడం గమనార్హం. సెంట్రల్​ కమిటీలో చాలా మంది తెలుగు వారే ఉన్నారు. కమిటీ సెక్రెటరీగా ఇటీవల జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి నియామకం అయ్యారు. అయితే రాష్ట్రానికి చెందిన సూజాతక్క తాజాగా తుపాకీని వీడి లొంగిపోవడం గమనార్హం. ఆమె భర్త కిషన్​జీ 2011లో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్​కౌంటర్ మృతి చెందాడు. ఆమె ప్రస్తుతం ఛత్తీస్​గడ్​ సౌత్​ ఏరియాకు సబ్ జోనల్ బ్యూరో ఇన్​ఛార్జిగా కొనసాగుతున్నారు.సుజాత లొంగుబాటుపై డీజీపీ జితేందర్(DGP Jitender)​ మీడియాతో మాట్లాడారు. అనారోగ్య కారణాలతో ఆమె లొంగిపోయినట్లు ​ వెల్లడించారు. ఆమెకు రూ.25 లక్షల క్యాష్​ రివార్డు ఇస్తామన్నారు. మిగతా వారు సైతం లొంగిపోవాలని ఆయన సూచించారు.

    More like this

    Lingampet | విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని మండల బీజేపీ (Lingampet BJP)...

    Hydraa | రూ.500 కోట్ల విలువైన భూమి కబ్జా.. షాకిచ్చిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో హైడ్రా దూకుడుగా...

    Bigala Ganesh Gupta | కిరణ్​కుమార్​ గౌడ్​కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బిగాల

    అక్షరటుడే, ఇందూరు: Bigala Ganesh Gupta | ప్రముఖ న్యాయవాది కిరణ్​కుమార్​ గౌడ్​ శుక్రవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు....