ePaper
More
    Homeక్రైంHyderabad | వీళ్లు మాములోళ్లు కాదు.. ఏకంగా శ్మశానంలో వ్యభిచారం

    Hyderabad | వీళ్లు మాములోళ్లు కాదు.. ఏకంగా శ్మశానంలో వ్యభిచారం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో పలు ప్రాంతాల్లో హైటెక్​ వ్యభిచారం (High-tech prostitution) నిర్వహిస్తారు. బ్యూటీ పార్లర్లు, స్పాల ముసుగులో వ్యభిచారం చేస్తున్న వారిని గతంలో పోలీసులు అరెస్ట్​ చేశారు.

    హైటెక్​ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్ట్​ చేస్తున్నారు. దీంతో వీరు కొత్త ప్లాన్​ వేశారు. ఎవరికి చిక్కకుండా దందా నిర్వహించాలని పథకం రచించారు. ఇందులో భాగంగా ఓ మహిళ ఏకంగా శ్మాశనంలో వ్యభిచార దందా నిర్వహిస్తోంది.

    Hyderabad | ఎవరికి అనుమానం రాకుండా..

    శ్మశాన వాటికలో వ్యభిచారం నిర్వహిస్తే ఎవరికి అనుమానం రాదని మాధవి అనే మహిళ భావించింది. ఇందులో భాగంగా బేగంపేట (Begumpet) పోలీస్​స్టేషన్​ పరిధిలోని శ్యామ్​లాల్​ బిల్డింగ్స్ సమీపంలోని ధనియాలగుట్ట శ్మశానవాటికలోని ఓ గదిని ఆమె అడ్డాగా ఎంచుకుంది. యువతులను తీసుకొచి, విటులను అక్కడికే రప్పించి దందా సాగిస్తోంది. అయితే శ్మశాన వాటికలోని గదిలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్​ఫోర్స్​ పోలీసులు (Task Force Police) తనిఖీలు చేపట్టారు.

    Hyderabad | యువతులను రప్పించి..

    పోలీసులు దాడి చేసిన సమయంలో ఓ మహిళతో పాటు విటుడు గదిలో ఉన్నాడు. మారీ మాధవి అనే మహిళ ఇక్కడ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకురాలితో పాటు యువతి, విటుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళలు, యువతులు, విటులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు మాధవి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    కాగా గతంలో అపార్ట్​మెంట్లు, ఇండిపెండెంట్​ హౌస్​లు, స్పాలలో సాగిన వ్యభిచారం తాజాగా శ్మశాన వాటికలకు విస్తరించడంతో నగరవాసులు షాక్​ అవుతున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె తెలివికి హ్యాట్సాప్​ అని కొందరు అంటుంటే.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్​ చేస్తున్నారు.

    More like this

    PM Modi | నేపాల్ యువతపై ప్రధాని మోదీ ప్రశంసలు.. రోడ్లపై పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారని వెల్లడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | యువత విధ్వంసంతో అల్లకల్లోలంగా నేపాల్ లో తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితులైన...

    Lok Adalat | రాజీమార్గ‌మే రాజ‌మార్గం.. న్యాయమూర్తి సుష్మ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Lok Adalat | క‌క్షిదారుల‌కు రాజీమార్గ‌మే రాజ‌మార్గమని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ(Judge...

    Kamareddy SP | ఆటోల చోరీ కేసులో అంతర్​ జిల్లా దొంగల అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ఆటోల చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్...