అక్షరటుడే, వెబ్డెస్క్ : India vs Pakistan | ఆసియా కప్ 2025(Asia Cup 2025)లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఊహించిన విధంగా జరగడం లేదు.
ప్రీమియం సీట్లకు డిమాండ్ చాలా తక్కువగా ఉంది. టికెట్ ధరలు(Ticket Rates) ఎక్కువగా ఉండటం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ మ్యాచ్‌కి ప్రీమియం టికెట్ల ధర ఏకంగా రూ.4 లక్షలు. ఈ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. అంతే కాకుండా, చివరి నిమిషంలో ప్రయాణ ఖర్చులు, హోటల్ బుకింగ్‌లు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. దీనివల్ల అభిమానులు వెనుకాడుతున్నట్లు స్పష్టమవుతోంది.
India vs Pakistan | ప్రీమియం కాదు, బడ్జెట్ టికెట్లకు ఓకే!
మీడియం రేంజ్, బడ్జెట్ కేటగిరీలో టికెట్లు కొంతవరకు అమ్ముడవుతున్నాయి. కానీ, సాధారణంగా భారత్ vs పాకిస్తాన్ (India vs Pakistan) మ్యాచ్లకు ఉండే హైప్ ఈసారి కనపడడం లేదు. లోయర్ స్టాండ్ టికెట్లు మాత్రమే వేగంగా అమ్ముడవుతున్నాయి, మిగిలిన టికెట్లు ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు లేరని వార్తలు వచ్చాయి. ఇది కూడా అభిమానుల్లో ఆసక్తి తగ్గడానికి కారణమవుతుందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అధికారులు (Cricket Board Officers) భావిస్తున్నారు. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో, టికెట్లు కేవలం నాలుగు నిమిషాల్లో అమ్ముడుపోయాయి. కానీ ఈసారి అలాంటి క్రేజ్ కనిపించడం లేదు.
సోషల్ మీడియాలో అభిమానులు ఈ విషయంపై జోరుగా చర్చించుకుంటున్నారు. “టికెట్ ధరలు చాలా ఎక్కువ”, “ఈ రేంజ్‌లో టికెట్ అంటే సాధారణ అభిమానులకు ఎలా సాధ్యం?” అనే కామెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని కామెంట్లు చూస్తే.. ఒక మ్యాచ్‌కు నాలుగు లక్షల టికెట్ అంటే ఏంటి?”, టీవీలో TV చూస్తే అదే ఫీలింగ్ వస్తుంది” అంటూ స్పందిస్తున్నారు. మరి కొద్ది గంటల్లో మ్యాచ్ మొదలు కానుండగా, టికెట్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశముంది. అందుకే, అభిమానులు ఆలస్యం చేయకుండా అధికారిక టికెట్ వెబ్‌సైట్ (Official Ticket Website) లేదా అనుబంధ స్టోర్లను తనిఖీ చేసి ముందే బుక్ చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.