ePaper
More
    HomeతెలంగాణHyderabad railway terminals | హైదరాబాద్​ చుట్టూ మూడు భారీ రైల్వే టెర్మినళ్లు.. ఏ...

    Hyderabad railway terminals | హైదరాబాద్​ చుట్టూ మూడు భారీ రైల్వే టెర్మినళ్లు.. ఏ మార్గాల్లోనంటే..!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad railway terminals | రైళ్ల రద్దీ దృష్ట్యా తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్‌ చుట్టూ కొత్తగా మూడు రైల్వే టెర్మినళ్లు రాబోతున్నాయి. ఈమేరకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.

    ఢిల్లీ Delhi, బెంగళూరు Bangalore, కోల్‌కతా Kolkata తదితర మహా నగరాల శివారు ప్రాంతాల్లోనూ భారీ రైల్వే టెర్మినళ్లు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను వీటిల్లో నిలువరిస్తున్నారు.

    అదే విధంగా హైదరాబాద్​లోనూ రైళ్ల రద్దీని తగ్గించేందుకు ఈ మహా నగరం చుట్టూ మూడు భారీ రైల్వే టెర్మినళ్లను తీసుకొస్తున్నారు. ఓఆర్​ఆర్​, ఆర్​ఆర్​ఆర్ ​మధ్యలో వీటిని నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది.

    Hyderabad railway terminals : ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్​

    భాగ్య నగరానికి ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌ Cherlapalli Terminal అందుబాటులోకి వచ్చింది. ఇది వరంగల్‌ మార్గంలో ఉంది. ఇక వికారాబాద్‌ – ముంబయి మార్గంలో రావాల్సి ఉంది. రామచంద్రాపురం మండలం నాగులపల్లిలో టెర్మినల్‌ ఏర్పాటుకు అవకాశం ఉంది.

    ఇక నిజామాబాద్‌ – నాందేడ్‌ మార్గం (Nizamabad-Nanded route) లో డబిల్‌పుర్‌(మేడ్చల్‌) Dabilpur (Medchal), మహబూబ్‌నగర్‌ – బెంగళూరు మార్గంలో జూకల్‌ (శంషాబాద్‌) టెర్మినళ్లు terminals నిర్మించాలనే యోచనలో రైల్వే శాఖ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలో ప్రతిపాదన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రస్థావించింది.

    More like this

    Kamareddy SP | ఆటోల చోరీ కేసులో అంతర్​ జిల్లా దొంగల అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ఆటోల చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్...

    Lingampet Mandal | ఫీడర్ ఛానల్​కు నీటి మళ్లింపు.. రైతుల పంటలు కాపాడేందుకు చర్యలు

    అక్షరటుడే, లింగంపేట: Lingampet Mandal | లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామ శివారులోని మల్లారం చెరువు కింద...

    Viral Video | ఇది ఐఫోన్ కాదు.. మేకప్ కిట్! .. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Viral Video | ప్రస్తుత టెక్నాలజీ యుగంలో విచిత్ర ఆవిష్కరణలకు కొదవే లేదు. సైకిల్‌ను...