ePaper
More
    HomeజాతీయంMadhya Pradesh CM | మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంకు త‌ప్పిన ముప్పు.. హాట్ ఎయిర్ బెలూన్‌లో వెళ్తుండ‌గా...

    Madhya Pradesh CM | మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంకు త‌ప్పిన ముప్పు.. హాట్ ఎయిర్ బెలూన్‌లో వెళ్తుండ‌గా మంట‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhya Pradesh CM | మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. శనివారం ఉదయం మందసౌర్‌లో గాంధీ సాగర్ ఫారెస్ట్ రిట్రీట్‌లో (Gandhi Sagar Forest Retreat) ఆయ‌న ప్రయాణిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ మంటల్లో చిక్కుకుంది.

    అయితే, అదృష్టవశాత్తు మంట‌లు పూర్తిగా అంటుకునే లోపు ముఖ్యమంత్రి సురక్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన వీడియో ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సీఎం మోహన్ యాదవ్ ప్ర‌యాణిస్తుండ‌గా, హాట్ ఎయిర్ బెలూన్ (Hot Air Balloon) నుంచి మంటలు చెలరేగాయి. మంటలు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, త్వరగానే అదుపులోకి వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన సమయంలో ముఖ్యమంత్రి ప్రశాంతంగా కనిపించారు. భద్రతా సిబ్బంది, స్థానిక అధికారులు ఆయనను వెంటనే అక్క‌డి నుంచి తరలించారు.

    Madhya Pradesh CM | క్రూయిజ్ రైడ్

    ప్ర‌మాదానికి ముందు రోజు సీఎం యాదవ్ గాంధీ (CM Yadav Gandhi) సాగర్ వద్ద చంబల్ నదిపై సుందరమైన క్రూయిజ్ రైడ్‌ను (Cruise Ride) ఆస్వాదించారు. ఈ ప్రాంతంలోని సహజ సౌందర్యాన్ని ప్రశంసించిన ఆయన ఇది మధ్యప్రదేశ్‌కు భవిష్యత్ పర్యాటక కేంద్రంగా మారుతుంద‌న్నారు. క్రూయిజ్ సమయంలో ముఖ్యమంత్రి పాటలు కూడా పాడారు. అక్కడ ఉన్న వారందరికీ విశ్రాంతి ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టించారు.

    Madhya Pradesh CM | మ‌హిళ‌ల‌పై వ‌రాలు..

    మాండ్‌సౌర్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ లాడ్లీ బెహ్నా యోజనకు సంబంధించి అనేక కీలక ప్రకటనలు చేశారు. దీపావళి తర్వాత ఈ పథకం కింద నెలవారీ సహాయం రూ.1,250 నుండి రూ.1,500కి పెంచనున్న‌ట్లు చెప్పారు. 2028 నాటికి ఈ మొత్తాన్ని నెలకు రూ.3,000కి పెంచుతామ‌న్నారు.

    More like this

    Lok Adalat | రాజీమార్గ‌మే రాజ‌మార్గం.. న్యాయమూర్తి సుష్మ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Lok Adalat | క‌క్షిదారుల‌కు రాజీమార్గ‌మే రాజ‌మార్గమని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు  న్యాయమూర్తి సుష్మ(Judge...

    Kamareddy SP | ఆటోల చోరీ కేసులో అంతర్​ జిల్లా దొంగల అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ఆటోల చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్...

    Lingampet Mandal | ఫీడర్ ఛానల్​కు నీటి మళ్లింపు.. రైతుల పంటలు కాపాడేందుకు చర్యలు

    అక్షరటుడే, లింగంపేట: Lingampet Mandal | లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామ శివారులోని మల్లారం చెరువు కింద...