అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం మిజోరం (Mizoram)లో పర్యటించారు. అయిజోల్(Aizawl)లో ప్రధాని బైరబీ-సైరాంగ్ రైల్వేలైన్‌ను జాతికి అంకితం చేశారు.
భారతీయ రైల్వే నెట్‌వర్క్(Indian Railway Network)తో అయిజోల్ అనుసంధానం చేస్తూ ఈ రైల్వే లైన్ నిర్మించారు. సైరాంగ్ నుంచి ఢిల్లీ, గౌహతి, కోల్‌కతాకు మూడు కొత్త రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. రూ.9వేల కోట్ల అభివృద్ధి పనులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.
PM Modi | పేదల కోసం..
మిజోరంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం మోదీ మట్లాడారు. క్యాన్సర్ వంటి వ్యాధులకు మందులను చౌకగా చేయడానికి జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. కుటుంబాలకు జీవితాన్ని సులభతరం చేయడానికి పన్ను రేట్లు తగ్గించామన్నారు. కాంగ్రెస్ పాలనలో, మందులు, బీమా పాలసీలపై భారీగా పన్నులు వేశారన్నారు. వారి పాలనలో ఆరోగ్య సంరక్షణ ఖరీదైనది, నేడు ఇవి అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో మందుల రేట్లు తగ్గుతాయని, వాహనాల ధరలు సైతం దిగివస్తాయన్నారు.
PM Modi | సైనికులు గుణపాఠం చెప్పారు
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) గురించి ప్రధాని మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మన సైనికులు గుణపాఠం నేర్పారన్నారు. ఈ ఆపరేషన్‌లో భారత్‌లో తయారు చేసిన ఆయుధాలు కీలక పాత్ర పోషించాయన్నారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి నమోదు చేసిందన్నారు.
PM Modi | తొలిసారి మణిపూర్‌కు..
మిజోరం పర్యటన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంఫాల్ చేరుకున్నారు. 2023లో మణిపూర్‌లో హింస చెలరేగిన తర్వాత ఆయన తొలిసారి అక్కడ పర్యటిస్తున్నారు. రూ.8,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్ట్‌లకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. మణిపూర్ ఘర్షణల్లో నిరాశ్రయులైన వారితో ప్రధాని మాట్లాడనున్నారు.