అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Andhrapradesh | ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం(YSR Congress Government) 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే.
అయితే, అప్పటినుంచి కొన్ని కొత్త జిల్లాల కేంద్రాలపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) నేతృత్వంలో ఈ అంశాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ముందడుగు వేసిందని సమాచారం. అదే సమయంలో, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పు వంటి విషయాలను కూడా పరిశీలించేందుకు ఏడుగురు మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ఇప్పటికే ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించగా, శాసనసభా సమావేశాలకల్లా రిపోర్ట్ అందించబోతోంది. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం తుదినిర్ణయాలు తీసుకునే అవకాశముంద
కొత్తగా ప్రతిపాదిత జిల్లాలు చూస్తే..
Andhrapradesh | మార్కాపురం జిల్లా (ప్రకాశం కేంద్రంగా):
మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అలాగే, ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపే ప్రతిపాదనపై కూడా చర్చ సాగుతోంది.
Andhrapradesh | అమరావతి అర్బన్ జిల్లా:
రాజధాని అమరావతి(Amaravati) పరిధిలోని ప్రాంతాలను కలిపి ప్రత్యేక అర్బన్ జిల్లా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో మంగళగిరి, తాడికొండ, నందిగామ, జగ్గయ్యపేట, పెదకూరపాడు వంటి నియోజకవర్గాలు కలిసే అవకాశం ఉంది.
Andhrapradesh | రంపచోడవరం-చింతూరు ఏజెన్సీ జిల్లా:
ఈ ప్రాంతాల ప్రజలు పరిపాలనకే దూరంగా ఉన్నారని, పాడేరు వరకు ప్రయాణం చేయడం కష్టమని అంటున్నారు. రంపచోడవరం డివిజన్, చింతూరు డివిజన్‌లోని నాలుగు విలీన మండలాలతో కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.
Andhrapradesh | ఇతర మార్పులు పరిశీలనలో:
ఎన్టీఆర్ జిల్లా(NTR District)ని విజయవాడగా మార్చాలన్న వాదన మళ్లీ ఊపందుకుంది. మరోవైపు కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల సమతుల్యత ఏర్పడడంతో గన్నవరం, పెనమలూరు వంటి నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కొన్ని జిల్లాల్లో నియోజకవర్గాల విభజన సమంగా లేకపోవడంతో దానిపై కసరత్తులు చేస్తున్నారన టాక్ ఉంది.
అయితే 2026 జనవరి 1 నుండి 2027 మార్చి 31 వరకు సరిహద్దుల మార్పులకి అవకాశం లేనందున 2025 డిసెంబర్ 31 నాటికి ఈ నిర్ణయాలను తీసుకుని అమల్లోకి తేవాల్సిన అవసరం ప్రభుత్వం ముందు ఉంది. అందుకే అసెంబ్లీ సెషన్(Assembly Session)కు ముందే క్యాబినెట్ సబ్‌కమిటీ నివేదిక రానున్న నేపథ్యంలో జిల్లాల వివాదానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.