ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizam Sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు కొనసాగుతున్న ఇన్​ఫ్లో

    Nizam Sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు కొనసాగుతున్న ఇన్​ఫ్లో

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam Sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

    జలాశయంలోకి ప్రస్తుతం 14,170 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ఎగువన సింగూరు (Singuru), పోచారం (PPocharam) ప్రాజెక్ట్​ల నుంచి నిజాంసాగర్​కు వరద వస్తోంది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 13,564 క్యూసెక్కులు మంజీర (Manjeera)లోకి వదులుతున్నారు. నిజాంసాగర్​ ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1404.7 (17.44 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.

    Nizam Sagar | పోచారంలోకి..

    నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్​కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్​కు 3,230 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. అంతేమొత్తంలో నీరు ప్రాజెక్ట్​పై నుంచి పొంగి, మంజీరలో కలుస్తోంది. డ్యామ్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1.82 టీఎంసీలు కాగా.. నిండుకుండలా కళకళలాడుతూ అలుగు పారుతోంది. ప్రాజెక్ట్​ అందాలను చూడటానికి పర్యాటకులు తరలి వస్తున్నారు. రెండో శనివారం, ఆదివారం కావడంతో రెండు రోజుల పాటు డ్యామ్​కు పర్యాటకులు భారీగా రానున్నారు.

    Nizam Sagar | ఏడుపాయల ఆలయం మూసివేత

    మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయాన్ని (Edupayala Temple) అధికారులు మరోసారి మూసి వేశారు. సింగూరు ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తడంతో ఆలయం ముందునుంచి మంజీర ఉధృతంగా పారింది. దీంతో ఇటీవల 27 రోజుల పాటు ఆలయం మూసి ఉంచారు. అయితే వరద తగ్గడంతో గురువారం అధికారులు ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అయితే మళ్లీ వరద పెరగడంతో ఆలయాన్ని శనివారం మూసి వేశారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు.

    More like this

    IPO | ఐపీవోలకు అద్భుత స్పందన.. భారీగా ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయిన కంపెనీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | ఈ వారంలో ఐపీవో(IPO)కు వచ్చిన మూడు మెయిన్‌బోర్డ్‌ కంపెనీలకు ఇన్వెస్టర్లనుంచి అద్భుతమైన...

    GGH Kamareddy | జీజీహెచ్​లో మృతశిశువు జననం.. వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణ

    అక్షరటుడే, కామారెడ్డి: GGH Kamareddy | పట్టణంలోని జిల్లా జనరల్​ ఆస్పత్రిలో మృతశిశువు జన్మించడం కలకలం రేపింది. దీనికి...

    Star Health | ‘స్టార్​ హెల్త్’ కస్టమర్లకు షాక్​.. క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించిన ఏహెచ్​పీఐ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Star Health | స్టార్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీదారులకు (Policy Holders) అసోషియేషన్ ఆఫ్...