అక్షరటుడే, వెబ్‌డెస్క్ : T20I Record | మాంచెస్టర్‌లో జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 300+ స్కోరు సాధించిన తొలి టెస్ట్ నేషన్‌గా ఇంగ్లాండ్ రికార్డు బద్దలు కొట్టింది. సౌతాఫ్రికా(South Africa) బౌలర్లపై విరుచుకుపడిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.
ఓపెనర్లు జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్ జట్టు భారీ స్కోరు చేయడానికి బలమైన పునాది వేశారు. వీరిద్దరు 7.5 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. బట్లర్ 30 బంతుల్లో 83 (8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత జాకబ్ బెథల్ (26) కాస్త మద్దతు ఇచ్చాడు.
T20I Record | సాల్ట్ సుడిగాలి సెంచరీ
ఫిల్ సాల్ట్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, ఇంగ్లాండ్(England) తరఫున వేగవంతమైన టీ20 సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. చివరికి 60 బంతుల్లో 141 పరుగులు (15 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ 21 బంతుల్లో 41 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్సర్) జోడించి స్కోరును 304కి చేర్చాడు. 305 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు తడబడింది. ఓపెనర్లు రికెల్టన్ (20), మార్క్‌రమ్ (41) ఇన్నింగ్స్‌ని స్పీడ్‌గానే ఆరంభించినా, మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ప్రిటోరియస్ (2), బ్రేవిస్ (4), స్టబ్స్ (23) త్వరగా ఔటయ్యారు. ఫెర్రారియా (23), ఫోర్టుయిన్ (31) కొంత ప్రతిఘటించిన కూడా 16.1 ఓవర్లలో 158 పరుగులకి సౌతాఫ్రికా జట్టు ఆలౌట్ అయింది.
ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. శామ్ కర్రన్, లియామ్ డాసన్, విల్ జాక్స్ చెరో రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికా బ్యాటర్లకు పూర్తిగా చెక్ వేశారు. తొలి 10 ఓవర్లలోనే 166 పరుగులు చేసిన ఇంగ్లండ్, అంతర్జాతీయ టీ20(International T20)ల్లో హాఫ్ ఇన్నింగ్స్‌లోనే అత్యధిక స్కోరు రికార్డును కూడా సొంతం చేసుకుంది. మొత్తంగా, ఇంగ్లండ్ ఈ విజయంతో టీ20ల్లో కొత్త చరిత్ర రాసింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లు, 300 మార్కుకి దగ్గరగా వచ్చినా కూడా ఆ రికార్డ్ చేరుకోలేకపోయాయి. ఏ జట్టు ఎప్పుడు ఆ రికార్డ్ అందుకుంటుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఇంగ్లండ్ జట్టు సరికొత్త రికార్డ్ తిరగరాసింది.