అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asia Cup | ఆసియా కప్(Asia Cup) 2025లో భాగంగా పాకిస్తాన్ జట్టు ఒమన్‌పై మంచి విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో ఒమన్ 67 పరుగులకే కుప్పకూలడంతో, పాకిస్తాన్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్(Pakistan)కు ఆరంభంలో పెద్ద దెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే ఓపెనర్ సైమ్ ఆయుబ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో జట్టు కోసం మంచి భాగస్వామ్యం నెలకొల్పారు మహ్మద్ హారిస్ (66) – సాహిబ్జాదా ఫర్హాన్ (29) జోడీ. వీరిద్దరూ రెండో వికెట్‌కు 85 పరుగులు చేశారు. హారిస్ 43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, ఫర్హాన్ మాత్రం నెమ్మదిగా ఆడి 29 పరుగులకే పరిమితమయ్యాడు.
Asia Cup | తొలి విజయం..
హారిస్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా(Captain Salman Ali Agha) (0), హసన్ నవాజ్ (9) విఫలమయ్యారు. దీంతో మిడిల్ ఓవర్లలో పాకిస్తాన్ రన్ రేట్ తగ్గింది.ఇక చివర్లో ఫఖర్ జమాన్ (23; 16 బంతుల్లో), మహ్మద్ నవాజ్ (19; 10 బంతుల్లో) స్పీడ్ పెంచడంతో జట్టు 160 పరుగులకు చేరుకుంది. అయితే చిన్న జట్టు అయినా ఒమన్ (Oman) బౌలర్లు పాకిస్తాన్‌ను ఇబ్బందిపెట్టారు. ఆమిర్ కలీమ్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. షా ఫైసల్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు (4 ఓవర్లు – 34 పరుగులు). వీరిద్దరి స్పెల్స్‌తో పాకిస్తాన్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.
లక్ష్య ఛేదనలో ఒమన్(Oman) బ్యాటర్లు ఒక్కరైనా నిలబడలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయి, మొత్తం 67 పరుగులకే ఆల్‌ఔట్ అయ్యారు. దీంతో మ్యాచ్ ఒకవైపు అయిపోయింది. ఈ విజయం పాకిస్తాన్‌కు విశ్వాసం ఇచ్చినా, బ్యాటింగ్‌లోని లోపాలు బయటపడ్డాయి. ఓపెనర్లు విఫలం కావడం, కెప్టెన్ సున్నాకి ఔటవడం, మధ్య ఓవర్లలో తడబాటు ఇవన్నీ భారత్‌తో కీలక పోరుకు ముందు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు జట్టు ఈ బలహీనతలను సరిదిద్దుకుని బిగ్ క్లాష్‌కు ఎలా సిద్ధమవుతుందో చూడాలి. మొత్తంగా, పాక్ బౌలర్ల ఆధిపత్యంతో విజయం దక్కింది. కానీ బ్యాటింగ్ వైఫల్యాలు రాబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఎంత ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.