ePaper
More
    HomeతెలంగాణWeather Updates | తెలంగాణకు అలెర్ట్​.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    Weather Updates | తెలంగాణకు అలెర్ట్​.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.

    బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు కూడా పలు జిల్లాల్లో భారీ వాన పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్​, నిర్మల్​, ఆసిఫాబాద్​, నిజామాబాద్​, కామారెడ్డి, కరీంనగర్​, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, సిరిసిల్ల, మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్​, రంగారెడ్డి, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

    Weather Updates | హైదరాబాద్​ నగరంలో..

    హైదరాబాద్ (Hyderabad)​లో శనివారం మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం లేదు. శుక్రవారం నగరంలోని పలు చోట్ల వర్షం పడింది.

    Weather Updates | కప్పేసిన పొగమంచు

    రాష్ట్రంలో శనివారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది. తెల్లవారు జామున నుంచి పొగ మంచు కప్పేసింది. చలి కాలాన్ని తలిపించేలా మంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ముందు వెళ్తున్న వాహనాలు కనిపించడం లేదని పేర్కొంటున్నారు. మరోవైపు ఉదయం నుంచి పలు జిల్లాల్లో ముసురు వాన పడుతోంది. చలితీవ్రత అధికంగా ఉంది.

    Weather Updates | ఉప్పొంగుతున్న వాగులు

    నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని వాగులు (Vagulu) మళ్లీ ఉధృతంగా పారుతున్నాయి. నదులకు సైతం వరద పోటెత్తింది. 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మళ్లీ వరుసగా వానలు పడుతుండటంతో అన్నదాతలు (Farmers) ఆందోళన చెందుతున్నారు.

    More like this

    GGH Kamareddy | జీజీహెచ్​లో మృతశిశువు జననం.. వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణ

    అక్షరటుడే, కామారెడ్డి: GGH Kamareddy | పట్టణంలోని జిల్లా జనరల్​ ఆస్పత్రిలో మృతశిశువు జన్మించడం కలకలం రేపింది. దీనికి...

    Star Health | ‘స్టార్​ హెల్త్’ కస్టమర్లకు షాక్​.. క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించిన ఏహెచ్​పీఐ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Star Health | స్టార్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీదారులకు (Policy Holders) అసోషియేషన్ ఆఫ్...

    Heroine Aishwarya Rajesh | అలరించిన హీరోయిన్​ ఐశ్వర్య

    అక్షరటుడే, ఇందూరు : Heroine Aishwarya Rajesh | "హలో నిజామాబాద్.. ఎలా ఉన్నారు".. అంటూ సంక్రాంతి సినిమా...