అక్షరటుడే, వెబ్డెస్క్: He married hijra | ఆ యువకుడు సాధారణ ఉద్యోగి.. తన తోటి ఉద్యోగుల్లో ఒకరు హిజ్రా.. ఆ ట్రాన్స్ జెండర్ transgender పై మనసు పడ్డాడు. ప్రేమించానని వెంట పడ్డాడు. ఎట్టకేలకు ఒప్పించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ ఆసక్తికర ఘటన తమిళనాడు TamilNadu లోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది.
సేలం జిల్లా తారమంగళం సమీపంలో ఉన్న ఓమలూర్ వాసి శరవణకుమార్(32) వస్త్రాల తయారీ సంస్థలో ఉద్యోగి. సరోవ(30) అనే హిజ్రా శరవణకుమార్తో కలిసి పనిచేస్తోంది.
కాగా సరోవను శరవణకుమార్ ప్రేమించాడు. సరోవను ఒప్పించాడు. ఇరువురి ప్రేమ ఓకే కావడంతో పెద్దల వద్దకు వెళ్లాడు. అతి కష్టం మీద పెద్దలను వారి పెళ్లికి అంగీకరించేలా చేశాడు.
He married hijra | అంగరంగ వైభవంగా వివాహం
ఇంకేం.. ఆకాశమంతా పందిరి.. భూమండలమంతా పీటలు వేసి అంగరంగ వైభవంగా వివాహ క్రతువు పూర్తి చేశాడు. ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాలయంలోని పెరియార్ కల్యాణ మండపంలో వీరి వివాహం జరిగింది.
వీరి వివాహానికి ద్రావిడ కళగం జిల్లా అధ్యక్షుడు న్యాయవాది మునియప్పన్ పెళ్లి marriage పెద్దగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ నవ జంట వివాహ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో social media వైరల్ అవుతున్నారు.
పలువురు నెటిజన్లు netizens వీరిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా యువకుడి ఆదర్శాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.