అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Road Transport Department | రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) ఎక్కువ శాతం రాత్రి పూట జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాల నియంత్రణకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ చర్యలు చేపట్టింది.
రాత్రి సమయంలో వాహనాల భద్రత కోసం రవాణా శాఖ కమిషనర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు మేరకు రాత్రి సమయంలో వాహనాలు కనిపించేలా.. రోడ్డు భద్రతా ప్రమాణాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
Road Transport Department | ప్రమాదాలకు కారణాలు
రాత్రి సమయంలో రోడ్డు ప్రమాదాలు ప్రధానంగా రోడ్డుపై భారీ వాహనాలను పార్కింగ్ (Vehicles Parking) చేయడంతో, సరిగా కనిపించక చోటు చేసుకుంటాయి. ముందు వెళ్తున్న వాహనం నెమ్మదిగా వెళ్తున్న సమయంలో సైతం ప్రమాదాలు జరుగుతాయి. దీంతో ప్రమాదాల నివారణకు వాహనాల వెనుక వైపు రిఫ్లెక్టర్లు (Reflectors), ప్రతిబింబ టేపులు, వెనుక మార్కింగ్ ప్లేట్లు/టేపులను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. అన్నిరకాల వాహనాలకు వీటిని అమర్చుకోవాలన్నారు.
Road Transport Department | వాటినే అమర్చుకోవాలి
నకిలీ టేపులు, మార్కింగ్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న ప్రయోజనం ఉండదని అధికారులు తెలిపారు. నకిలీ టేపులను నివారించడాని QR ఆధారిత నిర్వహణ సమాచార వ్యవస్థ (MIS) ఏర్పాటు చేయనున్నారు. ఏదైనా పరీక్షా సంస్థ ఆమోదించిన రిఫ్లెక్టివ్ టేపులు, మార్కింగ్ ప్లేట్‌లను తయారు చేసే OEMలను రవాణా కమిషనర్ ఎంప్యానెల్ చేయాలి. వాటిని మాత్రమే వాహనదారులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.