అక్షరటుడే, వెబ్‌డెస్క్ : DCB Bank | నిజామాబాద్ నగరంలోని డీసీబీ బ్యాంక్లో (DCB Bank) శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఏక్ శామ్.. ఆప్కే నామ్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఖాతాదారులకు బ్యాంక్ సేవలకు, ఫిక్స్డ్ డిపాజిట్లపై (fixed deposits) అవగాహన కల్పించారు. అనంతరం బ్యాంక్ సిబ్బందికి పలు ఆటలు ఆడించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శివ కుమార్, రిటైర్డ్ ప్రొఫెసర్ దయానంద్, కేశవ రావు, శివరామ కృష్ణ, ఖాతాదారులు పాల్గొన్నారు.