ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | నగరంలో అందుబాటులోకి మమ్మోగ్రఫీ టెక్నాలజీ..

    Nizamabad City | నగరంలో అందుబాటులోకి మమ్మోగ్రఫీ టెక్నాలజీ..

    Published on

    అక్షర టుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad City | నగరంలోని విశ్వం డయగ్నస్టిక్‌ కేంద్రంలో అత్యాధునిక మమ్మోగ్రఫీ టెక్నాలజీ (mammography technology) అందుబాటులోకి వచ్చింది. హెల్త్‌కేర్‌ టెక్నాలజీలో (healthcare technology) అగ్రగామి సంస్థ అయిన ఫ్యుజిఫిల్మ్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఈ మేరకు నెలకొల్పారు.

    దీంతో వ్యాధులను ముందుగా గుర్తించే అవకాశంతో పాటు అత్యాధునిక స్క్రీనింగ్‌ టెక్నాలజీలను (screening technologies) కల్పించడంలో విశిష్టమైన ముందడుగు వేసినట్లయింది. అమ్యులెట్‌ ఇన్నోవాలిటీ పరికరం అతి తక్కువ రేడియేషన్‌ మోతాదుతోనే అత్యధిక రిజల్యూషన్‌ కలిగిన చిత్రాలను ఇస్తుంది. తద్వారా రొమ్ము కేన్సర్‌ను (breast cancer) త్వరగా గుర్తించి, రోగులకు అత్యంత కచ్చితమైన డయాగ్నసిస్‌ లభిస్తుంది.

    అమ్యులెట్‌ ఇన్నోవాలిటీ సిస్టమ్‌లో (Amulet Innovation system) అత్యాధునిక డిటెక్టర్‌ డిజైన్‌ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. దట్టమైన రొమ్ము కణజాలాల్లో కూడా త్వరగా, స్పష్టంగా చిత్రాలను తీస్తుందని పేర్కొంటున్నారు. ఆటోమేటిక్‌ ఎక్స్‌పోజర్‌ కంట్రోల్, ఇమేజ్‌ ఎన్‌హాన్స్‌మెంట్, 3డి టోమోసింథసిస్‌లాంటి (3D tomosynthesis) ఫీచర్లతో వైద్యులు పదే పదే స్కాన్లు చేయాల్సిన అవసరం ఉండదని, వేగంగా రిపోర్టు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. దీంతో వైద్యులు రోగులకు అత్యంత నాణ్యమైన చికిత్సలను అందించడంపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

    ఈ సందర్భంగా ఫ్యూజిఫిల్మ్‌ ఇండియా (Fujifilm India) మెడికల్‌ సిస్టమ్స్‌ డివిజన్‌ బిజినెస్‌ ఎడ్వైజర్‌ షున్నుకె హోండా మాట్లాడుతూ.. ‘ఫ్యూజిఫిల్మ్‌ ఇండియాలో మేం సమాజాలకు సాధికారత కల్పించేలా వైద్యంలో సరికొత్త ఆవిష్కరణలను విస్తరించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. నిజామాబాద్‌ నగరంలో (Nizamabad city) అమ్యులెట్‌ ఇన్నోవాలిటీని ఏర్పాటు చేయడం భారతదేశంలో మహిళల ఆరోగ్య పరీక్షలను బలోపేతం చేయడంలో మరో ముందడుగవుతుందన్నారు.

    టైర్‌–2 నగరాలకు అంతర్జాతీయ స్థాయి మమ్మోగ్రఫీని (world-class mammography) తీసుకురావడం ద్వారా మరింత మంది మహిళలు త్వరగా గుర్తించే అవకాశాన్ని పొందేలా చూస్తున్నాన్నారు. దీంతో కచ్చితమైన డయాగ్నసిస్, మెరుగైన వైద్యం అందుతుందని, తాము చేపట్టిన ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే సీఎస్‌ఆర్‌ ప్రచారానికి కూడా మహిళల రొమ్ము కేన్సర్‌ పరీక్షల విషయంలో ఇది మద్దతిస్తుందని స్పష్టం చేశారు.

    More like this

    stone quarry explosion | రాతి క్వారీలో ఘోరం.. భారీ పేలుడు.. ఆరుగురు కార్మికుల దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: stone quarry explosion : పశ్చిమ బెంగాల్‌ West Bengal లో ఘోర ప్రమాదం సంభవించింది....

    Karnataka Fatal accident | కర్ణాటకలో ఘోర ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన కంటైనర్.. ఎనిమిది మంది దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Karnataka Fatal accident : కర్ణాటక Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ...

    He married hijra | హిజ్రాను ప్రేమించాడు.. పెళ్లి కూడా చేసుకున్నాడు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: He married hijra | ఆ యువకుడు సాధారణ ఉద్యోగి.. తన తోటి ఉద్యోగుల్లో ఒకరు...