ePaper
More
    HomeతెలంగాణMinister Jupally | కేటీఆర్‌కు మంత్రి జూపల్లి కౌంటర్.. ఆనాడు మీకు సిగ్గులేదా? అని సూటి...

    Minister Jupally | కేటీఆర్‌కు మంత్రి జూపల్లి కౌంటర్.. ఆనాడు మీకు సిగ్గులేదా? అని సూటి ప్రశ్న

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Jupally | పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) కౌంటర్‌ ఇచ్చారు. సిగ్గుందా అనే పదం కేటీఆర్‌(KTR)కు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఏమైందని ప్రశ్నించారు.

    కాంగ్రెస్‌ పై విమర్శలు చేసే ముందు కవిత ఆరోపణలపై స్పందించాలని హితవు పలికారు. ‘ఓటు చోరీ’ గురించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేస్తున్న ఆరోపణల కంటే, ‘ఎమ్మెల్యేల చోరీ’ కూడా చిన్న నేరం కాదన్న కేటీఆర్.. రాహుల్ గాంధీకి సిగ్గు లేదని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫొటోలను ఎక్స్ లో పోస్టు చేసిన కేటీఆర్.. రాహుల్ గాంధీని విమర్శించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ గాంధీభవన్‌(Gandhi Bhavan)లో మంత్రి జూపల్లి శుక్రవారం విలేకరులతో మట్లాడారు.

    Minister Jupally | అభివృద్ధి కోసమే..

    పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్న కేటీఆర్‌.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఎందుకు స్పందించలేదని జూపల్లి ప్రశ్నించారు. అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్‌ రెడ్డిని (CM Revanth Reddy) కలిశామని తాము పార్టీ ఫిరాయించలేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. ‘ఎమ్మెల్యేలు ఏదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు. ఆ రోజు మీకు సిగ్గులేదా? 88 స్థానాలు గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా?’ అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందే మీరు.. మళ్లీ ఇప్పుడు సిగ్గుందా అని ప్రశ్నిస్తున్నారా? అని మండిపడ్డారు.

    Minister Jupally | స్పీకర్‌ నిర్ణయమే అంతిమం..

    ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ మారలేదని, ఏ పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు చెబుతుంటే .. బీఆర్ఎస్‌ నేతలేమో (BRS leaders) మారారని అంటున్నారని జూపల్లి అన్నారు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్‌ దే తుది నిర్ణయమని, ఆ అంశం కోర్టు పరిధిలోకి రాదని చెప్పారు. చట్టబద్ధంగానే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. పదేళ్లలో అమరుల ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ (KCR) ఒక్కపనైనా చేశారా? అని ప్రశ్నించారు. కవిత ఆరోపణలపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నారు.

    Minister Jupally | వక్రీకరిస్తున్నారు..

    బీఆర్‌ఎస్‌ నాయకులు తన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి జూపల్లి విమర్శించారు. తాను చెప్పిన సందర్భాన్ని వదిలేసి, ఏదోదో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడడ్డారు. హామీలు ఇవ్వకున్నా అనేక పనులు చేశానని చెప్పానన్నారు. హామీలు అమలు చేశాను కాబట్టే.. ప్రజలు నన్ను ఏడుసార్లు గెలిపించారని తెలిపారు. హామీలు ఇవ్వకున్నా ప్రజలు గెలిపించారని చెబితే, తాను అస్త్రసన్యాసం చేసినట్లు ప్రచారం చేశారన్నారు. వాస్తవాలు మాట్లాడితే బూతులు మాట్లాడారని ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు.

    More like this

    stone quarry explosion | రాతి క్వారీలో ఘోరం.. భారీ పేలుడు.. ఆరుగురు కార్మికుల దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: stone quarry explosion : పశ్చిమ బెంగాల్‌ West Bengal లో ఘోర ప్రమాదం సంభవించింది....

    Karnataka Fatal accident | కర్ణాటకలో ఘోర ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన కంటైనర్.. ఎనిమిది మంది దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Karnataka Fatal accident : కర్ణాటక Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ...

    He married hijra | హిజ్రాను ప్రేమించాడు.. పెళ్లి కూడా చేసుకున్నాడు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: He married hijra | ఆ యువకుడు సాధారణ ఉద్యోగి.. తన తోటి ఉద్యోగుల్లో ఒకరు...