ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | ఎంఎంపీటీఎఫ్​ అమలుకు పూర్తి సహకారం

    Collector Nizamabad | ఎంఎంపీటీఎఫ్​ అమలుకు పూర్తి సహకారం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | వలసదారులు, దుర్భర కుటుంబాల స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో జిల్లాలో అమలు చేస్తున్న మైగ్రేషన్ మల్టీ పార్ట్​నర్​ ఫండ్ (Migration Multi-Partner Fund) కార్యక్రమానికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. ఈ మేరకు కమిటీ సభ్యులతో కలెక్టరేట్​లో శుక్రవారం సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని సిరికొండ (Sirikonda), ధర్పల్లి మండలాలను ఎంపిక చేశారన్నారు. దుర్భర కుటుంబాల స్థితిగతుల్లో మార్పు తేవాలనే సంకల్పంతో చేపట్టిన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలయ్యేలా చూస్తామన్నారు. అనంతరం యుఎన్​వో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందించే తోడ్పాటు తదితర అంశాలపై చర్చించారు.

    సమావేశంలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు, డీపీఆర్​వో పద్మశ్రీ, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, డీడబ్ల్యూవో రసూల్ బీ, డీపీవో శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు రోహిత్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి మధుసూదన్, కార్మిక శాఖ అధికారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

    More like this

    He married hijra | హిజ్రాను ప్రేమించాడు.. పెళ్లి కూడా చేసుకున్నాడు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: He married hijra | ఆ యువకుడు సాధారణ ఉద్యోగి.. తన తోటి ఉద్యోగుల్లో ఒకరు...

    Robbery on the road | కళ్లల్లో కారం కొట్టి దారి దోపిడీ.. రూ. 40 లక్షలు దోచుకుని పారిపోతుండగా ట్విస్ట్​!

    అక్షరటుడే, హైదరాబాద్: Robbery on the road | దోపిడీ దొంగలు బరి తెగించారు. దారిదోపిడీకి దిగారు. కళ్లల్లో...

    Medak | రెండేళ్ల కుమార్తెను చంపి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medak | మానవ సంబంధాలు మంట గలిసిపోయాయి. ప్రేమ, వివాహేతర సంబంధాల కోసం కొంత...