అక్షర టుడే, గాంధారి: Gandhari Mandal | మండలంలోని గుర్జాల్ తండాలో (Gurjalthanda) మూగజీవాలకు పూర్తిస్థాయిలో చికిత్స అందడం లేదు. ప్రస్తుతం గ్రామంలో 50కి పైగా ఆవులు, దూడలు లంపీ స్కిన్ వ్యాధి (lumpy skin disease) బారిన పడ్డాయి.
ఈ వ్యాధి ఒకదాని నుంచి మరొకదానికి వ్యాప్తి చెందుతోంది. అయినా, పశు వైద్యాధికారులు పట్టించుకోవడం లేదని పాడి రైతులు వాపోతున్నారు. ఈ విషయమై గ్రామ రైతులు పశు వైద్యాధికారికి (veterinary officer) ఇదివరకే విన్నవించారు. వ్యాధి సోకిన ఆవు మందలో మేతకు వెళ్లినప్పుడు మిగిలినవాటికి సోకుతోందని, దీంతో గ్రామంలోని ఆవు, దూడలన్నీ వ్యాధి బారిన పడే అవకాశముందని పేర్కొన్నారు. వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Gandhari Mandal | చికిత్స అందించండి..
– రఘుపతి, మాజీ ఉపసర్పంచ్
తండాలో ఆవులు, దూడలు లంపీ స్కిన్ వ్యాధి బారిన పడ్డాయి. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పశువుల డాక్టర్ వచ్చి ఇంజక్షన్లు చేసినా.. ఎలాంటి మార్పు రాలేదు. ఇకనైనా అధికారులు వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలి.