అక్షరటుడే, గాంధారి : Intermediate Education | మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి షేక్ సలాం శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో తరగతుల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, ఆన్‌లైన్ బోధన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
ఆయా తరగతులకు వెళ్లి బోధనా విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. బోధనా పద్ధతులు, విద్యార్థుల భాగస్వామ్యం, క్లాస్ అటెండెన్స్‌పై (Class Attendance) వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎఫ్‌ఆర్‌ఎస్‌లో (FRS) అధ్యాపకులు, విద్యార్థుల సమాచారం ఎలా నమోదు చేస్తున్నారనే అంశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో(Students) నేరుగా మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నారు.
Intermediate Education | అధ్యాపకులకు పలు సూచనలు
ఆన్‌లైన్ క్లాసులకు ముందుగానే సన్నద్ధత ఉండాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థులకు స్పష్టంగా, సులభంగా, అర్థమయ్యేలా బోధన జరగాలన్నారు. కళాశాలను తనిఖీ చేసిన అనంతరం సిబ్బందిని ఆయన అభినందిస్తూ, ప్రభుత్వ విద్యాసంస్థలకు (Government Educational Institutions) మంచిపేరు తేవాలని సూచించారు. విద్యార్థుల అభివృద్ధి దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం, అధ్యాపకులు లక్ష్మణ్, రాజగోపాల్, రమేష్, వెంకటస్వామి, సరిత, సుజాత, సంభాజీ తదితరులు పాల్గొన్నారు.