ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Open School Exams | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఓపెన్ టెన్త్, ఇంటర్​ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం

    Open School Exams | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఓపెన్ టెన్త్, ఇంటర్​ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్ : Open School Exams | వివిధ కారణాలతో చదువు మధ్యలో మానేసి ఎస్సెస్సీ, ఇంటర్​ చదవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రత్యేక​ అవకాశం కల్పించింది. ‘టాస్​’ పేరుతో ఓపెన్​ స్యూల్​ విధానంలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్​ పరీక్షలు రాసేందుకు అవకాశాన్ని కల్పించింది.

    Open School Exams | చదువు మానేసిన విద్యార్థులకు..

    రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ స్కూల్ విధానంలో ఎస్సెస్సీ (SSC), ఇంటర్​ పరీక్షలు (School Exams) రాసే అవకాశాన్ని కల్పించింది. మీ సేవ కేంద్రంలో ఫీజు చెల్లించి ఓపెన్ స్కూల్ విధానంలో ఎస్సెస్సీ పరీక్షలు రాయవచ్చు. అదేవిధంగా ఎస్సెస్సీ పాసై చదువు మానేసిన వారు ఇప్పుడు ఓపెన్ విధానంలో ఇంటి నుండే ఇంటర్​ పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంది.

    Open School Exams | అవగాహన కల్పించాలి

    మహిళా సంఘాల సభ్యులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు యువజన సంఘాలు ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 14 ఏళ్లు నిండి చదువు మధ్యలో ఆపేసిన ప్రతిఒక్కరూ మీసేవలో ఫీజు కట్టి పరీక్షలు రాయవచ్చు.

    పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 17వ తేదీ చివరి తేదీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్గట్ల ఎంఈవో ఆనంద్ రావు, ఐకేపీ ఏపీఎం కుంట గంగాధర్ మాట్లాడుతూ.. చదువు మధ్యలో మానేసిన వారికి ఇది సువర్ణ అవకాశమన్నారు. ఏర్గట్ల మండలంలో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్​లో లేదా ఎంఈవో, జిల్లా పరిషత్​ స్కూల్​ హెచ్​ఎం, మీసేవ కేంద్రాల్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

    More like this

    DCB Bank | బ్యాంక్​లో అవగాహన కార్యక్రమం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : DCB Bank | నిజామాబాద్​ నగరంలోని డీసీబీ బ్యాంక్​లో (DCB Bank) శుక్రవారం అవగాహన...

    Nizamabad City | నగరంలో అందుబాటులోకి మమ్మోగ్రఫీ టెక్నాలజీ..!

    అక్షర టుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad City | నగరంలోని విశ్వం డయగ్నస్టిక్‌ కేంద్రంలో అత్యాధునిక మమ్మోగ్రఫీ టెక్నాలజీ (mammography...

    Nepal PM | నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM | నేపాల్​లో ఉద్రిక్తతలు చల్లారాయి. దీంతో జెన్​జడ్​ ఉద్యమ కారులు తాత్కాలిక...