అక్షరటుడే, బోధన్: Bodhan | జీపీ తరపున విధులు నిర్వహిస్తూ సిద్ధాపూర్లో (Siddhapur) ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందిన ఇద్దరికి పరిహారం ఇవ్వాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు. బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలోని (Bodhan Government Hospital) పోస్టుమార్టం గది ఎదుట వారు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా మృతుల బంధువులు,కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ.. జీపీ తరపున పనిచేస్తూ వారు అకాల మరణం చెందినందున ఒక్కొక్కరికి రూ. 50లక్షల చొప్పున పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. వర్షంలోనూ వారు ధర్నా కొనసాగించారు.
సమాచారం అందుకున్న బోధన్ తహశీల్దార్ విఠల్ (Bodhan Tahsildar Vitthal), బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు (Bodhan Rural CI Vijay Babu) బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.