అక్షరటుడే, నిజాంసాగర్: Indiramma Houses | నిజాంసాగర్ మండలంలోని ఇందిరమ్మ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల జాబితాను శుక్రవారం విడుదల చేశారు. జాబితాను పంచాయతీ కార్యాలయంలో (Panchayat Office) నోటీస్బోర్డులో ఉంచినట్లు జీపీ కార్యదర్శి భీమ్రావు తెలిపారు. మండలంలో 28 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని చెప్పారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను ప్రారంభించాలని సూచించారు. ఆయన వెంట నాయకులు అనీస్ పటేల్, రాములు తదితరులు ఉన్నారు.
Indiramma Houses | వెల్గనూర్లో..
నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను విడుదల చేశారు. జీపీ కార్యదర్శి గంగాసాగర్ పంచాయతి కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కలిపిస్తామని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కరోబార్ భీమయ్య, యూత్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, విఠల్, విజయ్, తదితరులు ఉన్నారు.