ePaper
More
    HomeసినిమాMirai Movie | మిరాయ్‌లో రాముడిగా ప్ర‌భాస్.. అస‌లు వాస్త‌వం ఏంటి?

    Mirai Movie | మిరాయ్‌లో రాముడిగా ప్ర‌భాస్.. అస‌లు వాస్త‌వం ఏంటి?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mirai Movie | హనుమాన్‌ వంటి బ్లాక్‌బస్టర్ విజయంతో ఫుల్ ఫామ్‌లో ఉన్న యంగ్ హీరో తేజ సజ్జా తాజాగా నటించిన సినిమా మిరాయ్. ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.

    సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ విజన్ రీచ్డ్ యాక్షన్ ఫాంటసీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా, రీలీజ్‌కు ముందే ప్రభాస్ సర్‌ప్రైజ్ టాక్‌తో మరింత హైప్ క్రియేట్ అయింది. మిరాయ్ ప్రీమియర్స్‌కు ముందు, తేజ సజ్జా (Teja Sajja) ట్విట్టర్ వేదికగా అభిమానులకు హింట్ ఇచ్చాడు. “కొద్దిగంటల్లో మిరాయ్ మీ ముందుకు రాబోతోంది.. పెద్ద మనసున్న ప్రభాస్ గారికి కృతజ్ఞతలు. సినిమా స్టార్టింగ్‌లో రెబెలియస్ సర్‌ప్రైజ్ మిస్ అవ్వొద్దు!” – అంటూ ఆసక్తిని పెంచాడు.

    Mirai Movie | అస‌లు విష‌యం ఇది..

    తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. “రాజు అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా” వంటి పోస్టులతో ఆస‌క్తి రేకెత్తించారు. అభిమానులు ఊహించినట్లుగానే… మిరాయ్ ప్రారంభంలోనే ప్రభాస్ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ (Prabhas Powerful Voice Over) వినిపించడంతో థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది. బాహుబలి త‌ర్వాత టాలీవుడ్‌లో ప్రభాస్ అందించిన వాయిస్ ఓవర్ ఇది మొదటిసారి. ఆయన వాయిస్‌ తెరపై వినప‌డ‌గానే కేక‌ల‌తో, చప్పట్లతో థియేటర్లు హోరెత్తిపోయాయి. ప్రభాస్ అభిమానుల నుంచి మిరాయ్‌కి ఈ బిగ్ బూస్ట్‌ వల్ల మౌత్ టాక్ కూడా పాజిటివ్‌గా మారింది. అయితే చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించారంటూ ఒక ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ప్రభాస్ కవచంతో, మెరిసే ఆయుధాలతో రాజు మాదిరిగా క‌నిపించారు.

    ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో అది చూసిన అభిమానులు మరియు నెటిజ‌న్లు ప్ర‌భాస్ ఏ సీన్‌లో క‌నిపించారు అంటూ జ‌ట్టు పీక్కుంటున్నారు. కానీ అస‌లు విష‌యం ఏంటంటే.. కొంద‌రు ప్ర‌భాస్‌ని రాముడిగా ఎడిట్ చేసి తెర‌పై పెట్టారు. దాంతో అంద‌రు నిజ‌మ‌ని అనుకుంటున్నారు. కానీ అది ఎడిటెడ్ పిక్. ఆయ‌న కేవ‌లం వాయిస్ మాత్ర‌మే ఇచ్చారు. అయితే మొదట్లో ప్రభాస్ వాయిస్ ఓవర్‌తో ఊపందుకున్న మిరాయ్, చివర్లో రానా దగ్గుబాటి (Rana Daggubati) స‌ర్‌ప్రైజింగ్‌ ఎంట్రీతో ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ అందించింది. సినిమా కంటెంట్‌తో పాటు స్టార్ల ప్రభావం కూడా బాక్సాఫీస్ వసూళ్లపై గట్టిగా పనిచేసేలా కనిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాకు దాదాపు రూ.60 కోట్లు బడ్జెట్ కాగా, ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్స్, ఓటీటీ, శాటిలైట్ హక్కులతో కలిపి రూ.85 కోట్లు దాటినట్లు సమాచారం.

    More like this

    Gandhari Mandal | మూగజీవాలకు చికిత్స అందేనా..!

    అక్షర టుడే, గాంధారి: Gandhari Mandal | మండలంలోని గుర్జాల్‌తండాలో (Gurjalthanda) మూగజీవాలకు పూర్తిస్థాయిలో చికిత్స అందడం లేదు....

    Minister Jupally | గెలుస్తోమో లేదో.. హామీలు ఎలా ఇచ్చేది? మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Jupally | మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలు పరిష్కరించాలని...

    Science Seminar | రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్​లో రాణించాలి

    అక్షరటుడే, ఇందూరు: Science Seminar | రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్​లో రాణించాలని డీఈవో అశోక్ (DEO Ashok) అన్నారు....