అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prices fallen drastically : దేశమంతటా టమాట Tomato, ఉల్లి Onion ధరలు భగ్గుమంటుంటే.. ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh లో విచిత్ర పరిస్థితి నెలకొంది. పోరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ Telangana లోనూ టమాట, ఉల్లిగడ్డ ధరలు మండిపోతున్నాయి.
కానీ, ఏపీలో టమాట, ఉల్లిని పండించే రైతులకు ఇవి కన్నీరు తెప్పిస్తున్నాయి. మార్కెట్ మాయాజాలం, దళారుల దెబ్బతో ఉల్లి, టమాట రైతులు కుదేలయ్యారు.
రైతు వద్ద ఉల్లి కేజీకి రూ. 1.50 పలుకుతోంది. క్వింటాకు రూ.150 ఇచ్చి మధ్యవర్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇక టమాట పరిస్థితి కూడా అలాగే ఉంది. కేజీ టమాటను రైతు కేవలం రూ. 2 కే విక్రయించే దుస్థితి నెలకొంది.
Prices fallen drastically : పత్తికొండలో దారుణం..
కర్నూలు జిల్లా Kurnool district పత్తికొండ Pathikonda మార్కెట్లో గురువారం (సెప్టెంబరు 11) టమాటా కేజీ రూ.2 పలికింది. మదనపల్లె, నంద్యాల మార్కెట్లలో అతి కష్టం మీద రూ. 3 – 10 వరకు విక్రయించగలిగారు.
ఇక కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మధ్యవర్తులుగా ఉండే వ్యాపారులు ఉల్లి క్వింటాకు రూ.150 చొప్పున కొనుగోలు చేసినట్లు కర్షకులు తెలిపారు. ఇలా విక్రయించడం వల్ల కూలీ ఖర్చులు కూడా రాలేదని వాపోయారు.